Mehaboob Dilse : అమ్మా.. నువ్వు లేకుండా ఎలా బతకాలి.. బిగ్‌బాస్ మెహబూబ్ కి మాతృ వియోగం.. ఎమోషనల్ పోస్ట్..

ఇటీవల మెహబూబ్ తల్లి మరణించింది. తాజాగా తన తల్లి సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ దిగిన ఫోటోని, తన తల్లితో కలిసి ఉన్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్........

Mehaboob Dilse : అమ్మా.. నువ్వు లేకుండా ఎలా బతకాలి.. బిగ్‌బాస్ మెహబూబ్ కి మాతృ వియోగం.. ఎమోషనల్ పోస్ట్..

mehaboob dilse mother passed away

Mehaboob Dilse :  షార్ట్ ఫిలిమ్స్, ఆల్బమ్ సాంగ్స్ తో పాపులర్ అయిన మెహబూబ్ బిగ్ బాస్ తో మరింత ఫేమ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత సిరీస్ లు కూడా చేస్తూ అప్పుడప్పుడు టీవీ షోలలో కనిపిస్తున్నాడు. తాజాగా మెహబూబ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఇటీవల మెహబూబ్ తల్లి మరణించింది. తాజాగా తన తల్లి సమాధి వద్ద నివాళులు అర్పిస్తూ దిగిన ఫోటోని, తన తల్లితో కలిసి ఉన్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు మెహబూబ్.

Krithi Shetty : బాలీవుడ్ సినిమాలు చేయను.. లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసే ఆలోచన లేదు

మెహబూబ్ తన తల్లితో ఉన్న ఫొటోలని షేర్ చేసి.. ”అమ్మా.. నన్ను ఒంటరిగా వదిలి వెళ్లిపోయావ్‌. ఇకనుంచి నేను నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? ప్రతిరోజూ నేను ఎవరితో మాట్లాడాలి? నువ్వు లేకుండా ఎలా బతకాలి అమ్మీ. నువ్వు లేకుండా ఎలా బతకాలో అర్థం కావడం లేదు. నా ప్రతి ప్రయాణంలో తోడు ఉన్నావు. నా ఎదుగులను చూసి ఆనందించావు. మాకోసం సర్వస్వం త్యాగం చేశావు. నువ్వు లేకపోతే మా జీవితాలు ఎటు వెళ్తాయో కూడా అర్థం కావట్లేదు. ప్రతీక్షణం నిన్ను మిస్‌ అవుతూనే ఉంటాను అమ్మా. జీవితం అంటే ఏంటో నేర్పించావు. నువ్వు ఎక్కడున్నా నన్ను చూస్తావని నాకు తెలుసు. నిన్ను మరింత గర్వపడేలా చేస్తాను అమ్మా. తమ్ముడు, డాడీని బాగా చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను. నా హృదయంలో నీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను అమ్మా” అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. మెహబూబ్ ఫ్యాన్స్, పలువురు యూట్యూబర్స్ ఆమెకు నివాళులు అర్పిస్తూ, అతన్ని స్ట్రాంగ్ గా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.