Zion Clark : రెండు చేతులతో అత్యంగా వేగంగా పరుగెత్తుతాడు..గిన్నిస్ రికార్డు

రెండు కాళ్లు లేకున్నా..రెండు చేతులతో అత్యంత వేగంగా పరుగెత్తాడు. ఇతని వేగాన్ని లెక్కకట్టిన గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధులు...రికార్డు నమోదు చేశారు.

Zion Clark : రెండు చేతులతో అత్యంగా వేగంగా పరుగెత్తుతాడు..గిన్నిస్ రికార్డు

Zion

Updated On : September 24, 2021 / 6:06 PM IST

Guinness World Records : కాళ్లు లేకపోయినా..చేతులు లేకపోయినా.. ఏ మాత్రం కృంగిపోరు. ఇతరులకు ధీటుగా వారంత వారే పని చేసుకుంటుంటారు. ఇతరులకు స్పూర్తిని కలిగిస్తుంటారు. ఓ వ్యక్తి రెండు కాళ్లు లేకున్నా..రెండు చేతులతో అత్యంత వేగంగా పరుగెత్తాడు. ఇతని వేగాన్ని లెక్కకట్టిన గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధులు…అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తిగా రికార్డు సృష్టించాడని కితాబిచ్చారు. ప్రస్తుతం ఇతనికి సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ రికార్డ్స్ యూ ట్యూబ్ లో పోస్టు చేసింది. చాలా మంది నెటిజన్లు దీనిని చూసి..అతనిపై ప్రశంసలు కురిపించారు. అతని ఆత్మస్థైర్యం మెచ్చుకుంటున్నారు. ప్రయత్నం ఎప్పుడూ ఫెయిల్ కాలేదంటున్నారు.

Read More : Modi-Kamala Harris : యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌కి మోదీ అపూర్వ కానుక

యూఎస్ కు చెందిన జియోన్ క్లార్క్…పుట్టిన సమయంలో రెండు కాళ్లు లేవు. రెండు చేతులు మాత్రమే ఉన్నాయి. కాడల్ రిగ్రెషన్ సిండ్రోమ్ అనే అరుదైన జెనెటిక్ డిజార్డర్ వల్ల ఇలా జరిగిందని వైద్యులు వెల్లడించారు. తనకు కాళ్లు లేవని అతను చిన్నప్పటి నుంచి ఏ మాత్రం బాధ పడలేదు. తన ప్రయత్నం తాను చేశాడు. రెండు చేతులతోనే పనులు చేసుకున్నాడు. రోజుకు జిమ్ కు వెళ్తాడు. శరీరం కండలు తిరిగి ఉంటుంది.

Read More : Colette Maze : 107 ఏళ్ల వయస్సులో పియానో ఆల్బమ్ రిలీజ్ చేసిన బామ్మ

కానీ..అతనిలో ఓ లక్ష్యం ఉండేది. రెజ్లర్, అథ్లెట్, ఒలింపిక్స్ లో మెడల్ కొట్టలని అనుకొనే వాడు. అనుకోవడమే కాదు..గ్రౌండ్ లో దిగి ప్రాక్టీస్ మొదలు పెట్టడం చేయసాగాడు. రెండు కాళ్లు లేకున్నా…అథ్లెట్, రెజ్లర్ అయ్యాడు. అంతేకాదు..అత్యంత వేగంగా పరుగెత్తలనని నిరూపించాడు. కేవలం 20m 4.78 సెకండ్లలో పరుగెత్తాడు. గిన్నీస్ బుక్ రికార్డులో పేరు నమోదు చేసే వరకు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడితను. అందరూ అభినందిస్తున్నారు.