Young Women : ఉయ్యాల పట్టుతప్పి.. 6000 అడుగుల లోయలో పడ్డ యువతులు

ఇద్దరు యువతులు ఉయ్యాల ఊగేందుకు ప్రయత్నించారు. ఉయ్యాల ఊగుతున్న క్రమంలో కొండపై నుండి దిగువనున్న లోతును చూసి ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు.

Young Women : ఉయ్యాల పట్టుతప్పి.. 6000 అడుగుల లోయలో పడ్డ యువతులు

ఉయ్యాల పట్టుతప్పి చావు అంచులదాకా వెళ్ళి....

Young Women : ఉయ్యాల ఊగటమంటే చాలా మందికి భలే సరదా.. చిన్నతనంలో చాలా మంది చెట్లకు తాడులు కట్టి ఉయ్యాల ఊగుతూ జాలిగా గడిపిన రోజులను పెద్దయ్యాక కూడా మర్చిపోరు. అలాంటి తీపి గుర్తులను మరోసారి నెమరువేసుకోవాలనుకున్న ఇద్దరు యువతులు చివరకు చావు అంచులవరకు వెళ్ళొచ్చారు. రష్యాలో చోటు చేసుకున్న ఈఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రష్యాలోని డగేస్టన్ లోని కాన్యాన్ పర్యాటక ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల ఆటవిడుపుకోసం ఓ ఎత్తైన కొండ శిఖరం అంచున టూరిజం అధికారులు ఉయ్యాలను ఏర్పాటు చేశారు. నిత్యం చాలా మంది ఇక్కడి వచ్చి సరదాగా ఉయ్యాల ఊగుతూ చిన్ననాటి అనుభూతులను నెమరు వేసుకుంటుంటారు.

ఈక్రమంలోనే టూరిజం స్పాట్ కు వచ్చిన ఇద్దరు యువతులు ఉయ్యాల ఊగేందుకు ప్రయత్నించారు. ఉయ్యాల ఊగుతున్న క్రమంలో కొండపై నుండి దిగువనున్న లోతును చూసి ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. ఉయ్యాల ఊగుతూనే దానిపై నుండి ఒక్కసారిగా దూకేశారు. కొండపై నుండి నేరుగా 6000 అడుగుల లోయలో పడ్డారు. కొండ అంచున టూరిజం అధికారులు ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్ ఫాంపై పడటంతో ఆ ఇద్దరు యువతులు స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

ప్రస్తుతం వారు ఉయ్యాల ఊగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఉయ్యాల వేగం ఇంకా ఎక్కవగా ఉంటే ఈ పాటికి ఆ యువతులు ఇద్దరు ప్రాణాలు కొల్పోయి ఉండేవారని టూరిజం అధికారులు తెలిపారు. ఉయ్యాలకు ఉన్న ఒకవైపు తాడు తెగిపోవటం వల్లే ఇది జరిగినట్లు దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈఘటనపై దర్యాప్తు జరిపేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.