Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్‌ లో రష్యా పేరు వినిపించకపోవటం వెనుక అసలు కారణం..

జపాన్ రాజధాని టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం రష్యా మెడల్స్ లిస్టులో ఆ దేశపు పేరు వినిపించటంలేదు. దీనికి కారణమేంటీ? అంటే దీని వెనుక పెద్ద కారణమే ఉంది.

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్‌ లో రష్యా పేరు వినిపించకపోవటం వెనుక అసలు కారణం..

Tokyo Olympics Roc

Tokyo Olympics : టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం అయి వారం రోజులు దాటిపోయింది. ఐదు ఖండాలకు చెందిన క్రీడాకారులు తమ దేశం కోసం పతకాలు సాధించటానికి కృషి చేస్తున్నారు. ఒలింపిక్స్ పతకాలు సాధించటంలో చైనా ఎపుడూ ఉంటుందనే విషయం తెలిసిందే.చైనాతో పాటు రష్యా, అమెరికా దేశాలు కూడా పతకాల పంట పండించుకునేది.రష్యా అథ్లెట్లు పేరు ప్రతీ ఒలింపిక్స్ లోను మారు మ్రోగేది.కానీ జపాన్ రాజధాని టోక్యో ఒలింపిక్స్ లో మాత్రం రష్యా మెడల్స్ లిస్టులో ఆ దేశపు పేరు వినిపించటంలేదు. దీనికి కారణమేంటీ? అంటే దీని వెనుక పెద్ద కారణమే ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించాలంటే..అమెరికా, చైనా తర్వాత రష్యన్ అథ్లెట్లే ఎక్కువగా ఉండేవారు. గత ఒలింపిక్స్ లిస్టులో చూస్తే అదే కనిపిస్తుంది. ఒకప్పుడు ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్ల హవా ఎక్కువగా ఉండేది. వాళ్ల తర్వాతే అమెరికా పతకాల లిస్టు ఉండేది. రాను రానూ రష్యా ప్రభావం తగ్గింది. ప్రభావం తగ్గిన రష్యా అథ్లెట్లు సత్తా లేనివారేమీకాదు. టాప్ 1 లో లేకపోయినా కానీ కచ్చితంగా టాప్-5లో మాత్రం ఉండే తీరుతుంది. 2016 రియో ఒలింపిక్స్‌లో రష్యన్ అథ్లెట్లు 10 స్వర్ణపతకాలు, 17 రజతం, 20 కాంస్యాలతో మొత్తం 56 పతకాల పంట పడించారు. మెడల్స్ టాలీలో రష్యన్లు 4వ స్థానంలో ఉన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం రష్యా మెడల్స్ పేరు వినిపించటంలేదు. జులై నెలాఖరు వచ్చినా మెడల్స్ టాలీ చూసుకుంటే రష్యా పేరు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం ఒక్క పతకం కూడా రష్యా దేశం సాధించినట్లుగా వినిపించట్లేదు. కనిపిచంట్లేదు. మరి రష్యా టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనలేదు. ఆ దేశపు అథ్లెట్లు టోక్యో ఒలింపికస్ లో ఆడటం లేదా?అంటే అదేమీ లేదు. దీని వెనుక ఉన్న కారణం కూడా పెద్దదే..టోక్యో ఒలింపిక్స్ లో రష్యా అథ్లెట్లు 335 మంది పాల్గొన్నారు. ఆట కూడా ఆడుతున్నారు.

కానీ రష్యా పేరు మాత్రం వినిపించట్లేదు. ఇతర దేశాల లాగా రష్యన్ అథ్లెట్లు తమ దేశం పేరును వాడుకునే వీలు లేకుండా పోయింది. దేశం పేరు, జెండా, జాతీయ గీతాన్ని ఉపయోగించకుండానే రష్యన్ అథ్లెట్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. దీనికి కారణం ఒలింపిక్స్‌లో ఎన్నో చెరిగిపోని ముద్ర వేసిన రష్యా.. ఈ సారి వింత పరిస్థితిని ఎదుర్కుంటోంది. దేశం పేరుతో కాకుండా క్రీడాకారులు ఆర్వోసీ పేరుతో అంటే రష్యన్ ఒలింపిక్ కమిటీ పేరుతో బరిలో దిగారు. రష్యా దేశం పేరు వాడుకోవడానికి నిషేధం విధించడంతో ఆర్వోసీ పేరుతో బరిలోకి దిగాల్సి వచ్చింది. మెడల్స్ లిస్టులో కనపడుతున్న ఆర్వోసీ అంటే రష్యా క్రీడాకారులే అనే విషయం గుర్తించాలి. అలా ఈ ఒలింపిక్స్ లో కూడా రష్యా అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. భారత్ కు అడపా దడపా పతకాలు ఖరారు అవుతుంటే మరోపక్క రష్యా అథ్లెట్లు మాత్రం సత్తా చాటుతున్నారు. క్రీడలు ఏవైనా పతకాలు మావే అనేలా సత్తా చాటే రష్యాన్ ఈ టోక్యో ఒలింపిక్స్ లో కూడా పతకాల పంట పండిస్తున్నారు.

అలా దీంట్లో భాగంగా ఆర్వోసీ ఆటగాళ్లు అదేనండీ రష్యా ఒలింపిక్ కమిటీ అథ్లెట్లు ఇప్పటి వరకూ 10 స్వర్ణం, 14 రజతం, 10 కాంస్య పతకాలు నెగ్గి నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే రష్యాపై నిషేధానికి కారణం ఏంటో కూడా తెలుసుకోవాలి.అంతర్జాతీయ పోటీలు, టోక్యో ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్ కప్ 2022లో పాల్గొనకుండా రష్యాను 2019 డిసెంబర్‌లో వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నిషేధం విధించింది. కొన్నేళ్లుగా రష్యా తమ అథ్లెట్లు డోప్ టెస్టుల్లో పట్టుబడకుండా ఒక అధునాతనమైన విధానాన్ని కనిపెట్టి అమలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ ఫెడరేషన్లు రష్యన్ అథ్లెట్లను పోటీ పడటాన్ని నిషేధించారు. సెప్టెంబర్ 2018లో అనేక విచారణల అనంతరం వాడా ఒక నిబంధనపై రష్యన్ అథ్లెట్లను అనుమతించడానికి అంగీకరించింది. మాస్కోలోని లాబ్‌కు చెందిన అథ్లెట్ల డేటాను తమకు అందిస్తే తాను అప్పుడు అనుమతిస్తామని చెప్పింది. దీనికిసంబంధిచిన డేటాను వాడాకు ఇవ్వగా.. వందలాది మంది రష్యన్ అథ్లెట్లు డోపీలు అని తేలింది. ఆ డేటా ఆధారంగా రష్యాను అంతర్జాతీయ క్రీడల నుంచి నాలుగేళ్ల పాటు నిషేధించారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. రష్యా చేస్తున్న ఈ డోపింగ్ కార్యక్రమాన్ని బయటపెట్టింది కూడా రష్యాకు చెందిన అథ్లెట్లే కావడం.