Chiranjeevi : టాలీవుడ్ పెద్దన్నయ్య చిరంజీవి..

చిరంజీవి లాంటి ‘భోళా శంకరుడు’ ఇండస్ట్రీకి పెద్దన్నగా, పెద్ద దిక్కుగా, పరిశ్రమకు అండగా నిలబడాలని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు..

Chiranjeevi : టాలీవుడ్ పెద్దన్నయ్య చిరంజీవి..

Chiranjeevi

Chiranjeevi: ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమకు భవిష్యత్ కార్యచరణకు సంబంధించి దిశా నిర్దేశం చెయ్యడానికి ఓ పెద్ద దిక్కు అవసరం.. తెరమీద వినోదం పంచే ఆర్టిస్టులకు తెరవెనుక ఆనందకరమైన జీవితం, పేద కళాకారులకు చేయూత, వృద్ధ కళాకారులను ఆదుకోవడం, సభ్యులందరికీ ఇళ్లు.. ఇలా పలు కార్యక్రమాలు చేపట్టడానికి.. పరిశ్రమను సరైన దారిలో నడిపించడానికి ఓ నాయకుడు కావాలి.

Happy Birthday Chiranjeevi : బాస్ బర్త్‌డే.. ‘మెగా’ విషెస్..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి మరణానంతరం ఎన్నో విపత్కర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటీవల ‘మా’ ఎన్నికల విషయాన్నే తీసుకుంటే.. తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది. థియేటర్ల, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలు, టికెట్ రేట్లు.. ఇలా చాలా సమస్యలు పరిష్కారమవ్వాలి. అందుకే ఇండస్ట్రీకి ఓ పెద్ద దిక్కు కావాలి. ఈ విషయంలో అందరి చూపు మెగాస్టార్ చిరంజీవి వైపే ఉంది.

Bholaa Shankar : ‘మెగాస్టార్’ చెల్లెలిగా ‘మహానటి’..

నటుడిగా ఉన్నప్పుడు బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ ప్రారంభించి ఎందరికో రక్త, నేత్ర దానం చేసిన ఘనత చిరంజీవిది. కరోనా కష్టకాలంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC) ని ఏర్పాటు చేసి పలు దఫాలుగా ఎంతోమంది సినీ కార్మికులకు అండగా నిలిచారు. తన కారవ్యాన్ డ్రైవర్ మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. పలువురు జర్నిలిస్టులకు చికిత్స నిమిత్తం ఆర్థిక సాయమందించారు.

Chiranjeevi : కార‌వ్యాన్ డ్రైవ‌ర్ కుటుంబానికి చిరంజీవి సాయం..

ఇటీవల దాసరి కో-డైరెక్టర్ కుమార్తె కాలేజ్ ఫీజుకి సాయం చేశారు. ఇలా ఎంతోమందికి ఎన్నో రకాలుగా అవసరమైన సాయం చేస్తున్నారు. అలాగే చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి, కోవిడ్ బాధితులను ఆదుకున్నారు.

Bharath Bhushan : ఫోటో జ‌ర్న‌లిస్ట్‌కి మెగాస్టార్ చిరంజీవి ఆర్థిక సాయం..

రిల‌యన్స్ సంస్థ ద్వారా జాతీయ అంత‌ర్జాతీయ ప్ర‌ముఖులు ‘వియ్ ఫర్ ఇండియా’ సంస్థ ద్వారా చారిటీ కార్య‌క్ర‌మం చేపట్టి భార‌త‌దేశంలో కోవిడ్‌కి సంబంధించిన ఫండ్‌ని రైజ్ చేయాల‌ని ఆగ‌స్టు 15న ఓ ప్ర‌య‌త్నం చేయ‌గా ఇందులో మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. 5 మిలియ‌న్ల అమెరిక‌న్ డాల‌ర్లు నిధిగా సేక‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్ర‌ఖ్యాత హాలీవుడ్ పోర్ట‌ల్ డెడ్ లైన్ హాలీవుడ్ (Deadline Hollywood )లో ప్ర‌ముఖంగా క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది.

Chiranjeevi : జాతీయ, అంత‌ర్జాతీయ స్థాయిలో చిరంజీవి కోవిడ్ నిధి సేక‌ర‌ణ..

అందుకే చిరు లాంటి ‘భోళా శంకరుడు’ ఇండస్ట్రీకి పెద్దన్నగా, పెద్ద దిక్కుగా, పరిశ్రమకు అండగా నిలబడాలని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. ‘మా’ ఎన్నికల్లో చిరు, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్‌కి మద్దతు తెలపడంతో ఆయన గెలుపు ఖాయం అయిపోయినట్లే అనే మాట ప్రధానంగా వినిపిస్తోంది. ఎన్నికలు జరపాల్సిందేనంటూ తన నిర్ణయాన్ని తెలిపారు మెగాస్టార్. చిరు మద్దతుతో ప్రకాష్ రాజ్ ‘మా’ కు సొంత బిల్డింగ్‌తో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తారని ఆశిస్తున్నారు. ఒకవేళ ‘మా’ అధ్యక్షుడు ఎవరైనా.. పరిశ్రమకు మాత్రం ‘బిగ్ బాస్’ చిరంజీవే అంటుంది టాలీవుడ్.

Prakash Raj : మెగాస్టార్‌ని మీట్ అయిన ప్రకాష్ రాజ్..