T20 World Cup 2026 : దంచికొట్టిన మున్సే, మెక్ముల్లెన్.. స్కాట్లాండ్ భారీ స్కోరు.. ఇటలీ టార్గెట్ ఎంతంటే..?
టీ20 ప్రపంచకప్2026లో (T20 World Cup 2026) భాగంగా కోల్కతా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఇటలీ ముందు స్కాట్లాండ్ భారీ స్కోరును ఉంచింది.
T20 World Cup 2026 Scotland 207 in 20 overs Italy target is 208
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్, ఇటలీ జట్లు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. దీంతో ఇటలీ ముందు 208 పరుగుల లక్ష్యం నిలిచింది.
స్కాట్లాండ్ బ్యాటర్లలో జార్జ్ మున్సే (84; 54 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. బ్రాండన్ మెక్ముల్లెన్ (41 నాటౌట్; 18 బంతుల్లో 4 సిక్సర్లు), మైఖేల్ జోన్స్ (37; 30 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), మైఖేల్ లీస్క్ (22 నాటౌట్; 5 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. ఇటలీ బౌలర్లలో అలీ హసన్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా, జెజె స్మట్స్ తలా ఓ వికెట్ సాధించారు.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన స్కాట్లాండ్కు ఓపెనర్లు మున్సే, జోన్స్ శుభారంభాన్ని అందించారు. ఓ వైపు జోన్స్ నిలకడగా ఆడగా.. మరోవైపు మున్సే చెలరేగిపోయాడు. బౌండరీల మోత మోగించాడు. బెన్ మనేంటి బౌలింగ్లో సిక్స్ కొట్టి మున్సే 30 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ తరువాత కూడా అంతే ధాటిగా బ్యాటింగ్ కొనసాగించాడు. శతకానికి చేరువైన అతడిని గ్రాంట్ స్టీవర్ట్ బోల్తా కొట్టించాడు. హ్యారీ మానేంటి క్యాచ్ అందుకోవడంతో మున్సే పెవిలియన్కు చేరుకున్నాడు.
We have set a target of 208 against Italy!#T20WorldCup #FollowScotland #ChooseCricket pic.twitter.com/YuXZDAmvYf
— Cricket Scotland (@CricketScotland) February 9, 2026
కాగా.. మున్సే, జోన్స్ లు తొలి వికెట్కు 13.5 ఓవర్లలోనే 125 పరుగులు జోడించారు. ఆ మరుసటి ఓవర్లోనే మరో ఓపెనర్ జోన్స్ ఔట్ అయ్యాడు. దీంతో 136 పరుగుల వద్ద స్కాట్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. వన్డౌన్ బ్యాటర్ బ్రాండన్ మెక్ముల్లెన్ చెలరేగి ఆడగా, ఆఖరిలో మైఖేల్ లీస్క్ దంచికొట్టడంతో స్కాట్లాండ్ 200 పరుగుల స్కోరును దాటింది.
