Gold and Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలుదారులకు బిగ్ అలర్ట్.. నేటి ధరలు ఇవే..
Gold and Silver Rates Today : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 53డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 5,019 డాలర్ల వద్దకు చేరింది.

బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారా..? అయితే, మీకు భారీ షాకింగ్ న్యూస్. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.

సోమవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 2,240 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 2,050 పెరిగింది.

అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఔన్సు గోల్డ్ పై 53డాలర్లు పెరిగింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ 5,019 డాలర్ల వద్దకు చేరింది.

సోమవారం వెండి ధర కూడా భారీగా పెరిగింది. శనివారం కిలో వెండిపై రూ. 5వేలు పెరగ్గా.. తాజాగా (సోమవారం) కిలో వెండిపై రూ. 15వేలు పెరిగింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలను పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో.. 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,45,600 వద్దకు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,58,840కు చేరింది.

దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో 22క్యారట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,45,750కాగా.. 24క్యారట్ల ధర రూ. 1,58,900కు చేరింది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో 10గ్రాముల 22క్యారట్ల పసిడి ధర రూ.1,45,600కు చేరగా.. 24క్యారట్ల ధర రూ.1,58,840కు వద్దకు చేరింది.

ఇవాళ్టి వెండి ధర ఇలా.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో ఇవాళ వెండి ధర భారీగా పెరిగింది. దీంతో ఆయా నగరాల్లో కిలో వెండి ధర రూ.3,00,000కు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.3,00,000 వద్ద కొనసాగుతోంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 3,00,000 వద్దకు చేరింది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
