Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం భారీ మైథలాజికల్ మూవీ.. దర్శకుడు ఎవరో తెలుసా?
మైథలాజికల్ కాన్సెప్ట్ తో భారీ సినిమా చేస్తున్న టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram).
Kiran Abbavaram doing a big-budget mythological movie.
- కె-ర్యాంప్ తరువాత ఫుల్ జోష్ లో కిరణ్ అబ్బవరం
- మైథలాజికల్ కంటెంట్ తో భారీ సినిమా సెట్
- త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
Kiran Abbavaram: కె-ర్యాంప్ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం. ఫన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఈ సినిమా తరువాత కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందుకే, తరువాత సినిమాలు కూడా అదే రేంజ్ లో ఉండేలా చూసుకుంటున్నాడు ఈ హీరో. ఈ నేపధ్యంలోనే భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట కిరణ్ అబ్బవరం.
పమైథలాజికల్ కంటెంట్ తో వస్తున్న ఈ ప్రాజెక్టు కి సంబంధించి ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత ప్రేరణ అరోరా, జీ స్టూడియోస్ అధినేత ఉమేష్ బన్సాల్‌తో కలిసి ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు మేకర్స్. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారట. నిజానికి, కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఉన్న మార్కెట్ కి పోలిస్తే చాలా ఎక్కువ అనే చెప్పాలి.
Tharun Bhascker: రూ.5 కోట్ల చెక్ పక్కన పెట్టేసి.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న తరుణ్ భాస్కర్
కానీ, కంటెంట్ తో ఉన్న కొత్తదనాన్ని నమ్మి అంత ఖర్చు చేస్తున్నారట మేకర్స్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి స్టార్ హీరోయిన్ ని తీసుకోబోతున్నారట. అయితే, ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి దర్శకుడు ఎవరు అనేది మాత్రం ఇంకా ఫిక్స్ అవలేదని తెలుస్తోంది. ఫిక్స్ అవగానే ఆ విషయంపై కూడా అధికారిక ప్రకటన రానుంది.
ఇక కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన దర్శకుడు సాయి రాజేష్ తో చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు. బేబీ లాంటి సూపర్ సక్సెస్ తరువాత సాయి రాజేష్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ మాదిరిగానే ఈ సినిమా కూడా ఎమోషనల్ రైడ్ లా ఉండనుందని మేకర్స్ చెప్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
