Venkata Satish Kilaru : ‘పెద్ది’ ప్రీమియర్స్ అనౌన్స్.. నాకు ఫుడ్ పెట్టారు.. చరణ్ కి జీవితాంతం రుణపడి ఉంటా.. నిర్మాత వ్యాఖ్యలు..
ఈ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట్ సతీష్ కిలారు మాట్లాడుతూ.. (Venkata Satish Kilaru)
Venkata Satish Kilaru
Venkata Satish Kilaru : బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, గ్లింప్స్ తో ఫ్యాన్స్ లో సినిమాపై హైప్ పెరిగింది. నేడు పెద్ది సినిమా మొదటి ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి నిర్మాతలు, సుకుమార్, డైరెక్టర్ బుచ్చిబాబు సాన, డీఓపీ రత్నవేలు.. పలువురు మూవీ టీమ్ హాజరయ్యారు.
ఈ ప్రెస్ మీట్ లో పెద్ది సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాని జూన్ 4వ తేదీనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
Also Read : Peddi : ‘పెద్ది’ సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. అఫీషియల్ అనౌన్స్.. రక్తంతో తడిచిన చరణ్ పోస్టర్ కూడా..
ఈ సినిమా ప్రెస్ మీట్ లో నిర్మాత వెంకట్ సతీష్ కిలారు మాట్లాడుతూ.. రామ్ చరణ్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. అసలు నేనేంటో కూడా తెలియకుండా రామ్ చరణ్ గారు మాకు ఫస్ట్ సినిమా ఇచ్చినందుకు రుణపడి ఉంటాను. బుచ్చి బాబు ఈ సినిమాని చాలా బాగా చేసి పెట్టాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ మీద నేను హ్యాపీగా ఉన్నా. ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా. ఈ సినిమా ఎమోషనల్ రైడ్. అందరూ చూడొచ్చు.
షూటింగ్స్ లో రోజూ చరణ్ గారు ఆయన ఇంటి దగ్గర్నుంచి భోజనం తెప్పించి పెట్టేవారు నాకు. రోజూ మధ్యాహ్నం ఆయన దగ్గర కూర్చొని తినేవాడిని. నిన్నే లాస్ట్ డే షూట్. నిన్న కూడా కూర్చొని కలిసి తిన్నాము నేను, చరణ్. నేను డే 1 నుంచి ఇవాళ్టివరకు హ్యాపీగా ఉన్నా సినిమా మేకింగ్ లో. జూన్ 4న రిలీజ్ చేస్తున్నాం. జూన్ 3న రాత్రి ప్రీమియర్స్ ఉంటాయి అని అన్నారు.
Also Read : Gaayapadda Simham : ‘గాయపడ్డ సింహం’ రివ్యూ.. ట్రంప్ మీద కోపంతో తరుణ్ భాస్కర్ ఏం చేసాడు?
