KTR : నీ టైం ఇంకా రెండేళ్లే.. దేవుళ్ళను మొక్కుకో.. పాతాళంలో దాక్కున్నా విడిచిపెట్టం.. కేటీఆర్ సంచలన కామెంట్స్..
KTR : సీఎం రేవంత్ రెడ్డి పేరు లాగుల తొండల రెడ్డి. రాష్ట్రాన్ని నడపడం ఆయనకు చేతకావడం లేదు. కేవలం కేసీఆర్ ను బూతులు తిట్టడం మాత్రమే ఆయనకు తెలుసు.. అంటూ కేటీఆర్ విమర్శించాచుూ
KTR
- రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని నడపడం చేతకావడం లేదు.
- కేసీఆర్ను బూతులు తిట్టడం మాత్రమే అతనికి తెలుసు
- కేసీఆర్ను తిడితే వదిలిపెట్టం..
- నీటైం ఇంకా రెండేళ్లే.. దేవుళ్లను మొక్కుకో.. పాతాళంలో దాక్కున్నా వదిలిపెట్టం
- సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరిక
KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంకు చివరి రోజు కావడంతో కేటీఆర్ పలు ప్రాంతాల్లో రోడ్ షోలలో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Also Read : Toll Plaza : వాహనదారులకు బిగ్ అలర్ట్.. టోల్ గేట్ల వద్ద ఆ ఇబ్బందులకు ఇక చెక్.. కానీ, ఈ నిబంధనలు పాటించాలి..
సీఎం రేవంత్ రెడ్డి పేరు లాగుల తొండల రెడ్డి. రాష్ట్రాన్ని నడపడం ఆయనకు చేతకావడం లేదు. కేవలం కేసీఆర్ ను బూతులు తిట్టడం మాత్రమే ఆయనకు తెలుసు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మొనగాడు ఎక్కడ ఉన్నాడంటూ కేటీఆర్ ప్రశ్నించారు. లక్కీ డ్రాలో రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటూ ఎద్దేవా చేశారు.
రాజకీయంగా తిడితే మమ్మల్ని తిట్టు.. కానీ, కేసీఆర్ ను తిడితే మాత్రం పొట్టోడా నిన్ను వదిలిపెట్టం అంటూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీ టైం ఇంకా రెండేళ్లే.. దేవుళ్లను మొక్కుకో.. రెండేళ్ల తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది.. నువ్వు పాతాళంలో దాక్కున్నా నిన్ను వదిలిపెట్టం అంటూ కేటీఆర్ హెచ్చరించారు.
భూపాలపల్లి జిల్లాను తీసేస్తే ఊరుకోమని కేటీఆర్ అన్నారు. సింగరేణి నల్లబంగారాన్ని రేవంత్ రెడ్డి బామ్మర్ది సృజన్ రెడ్డికి రాసి ఇచ్చిండు. నల్ల బంగారాన్ని.. ఆయన అత్తగారి కొంగు బంగారం లా మార్చాడు. మే25 నుంచి ఇప్పటి వరకు ఆరువేల కోట్లు రేవంత్ రెడ్డి ఆయన బామ్మర్థికి రాసిచ్చిండు. ఆధారాలు బయటపెట్టడంతో హైదరాబాద్లో ఫోరెన్సిక్ ల్యాబ్ కాలబెట్టించారంటూ కేటీఆర్ ఆరోపించారు. బూతుల సీఎంకు ప్రజలు పోలింగ్ బూతులోనే బుద్ధి చెప్పాలని కేటీఆర్ పులుపునిచ్చారు. మరోవైపు.. పూజకు పనికిరాని పువ్వు బీజేపీ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
