Upcoming EV Cars in India: 2022 నుంచి ఊపందుకోనున్న ఎలక్ట్రిక్ వాహనాల జోరు: భారత్ లో ఇవే టాప్ ఎలక్ట్రిక్ కార్స్

వినియోగదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతుంది. ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు భారత ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలు

Upcoming EV Cars in India: 2022 నుంచి ఊపందుకోనున్న ఎలక్ట్రిక్ వాహనాల జోరు: భారత్ లో ఇవే టాప్ ఎలక్ట్రిక్ కార్స్

Ev Cars

Upcoming EV Cars in India: భారత్ లో చమురు ధరలు సగటు వాహనదారుడిని బెంబేలెత్తిస్తున్నాయి. పెట్రోల్ ధరలు రూ.100కి పైనే ఉన్నాయి, ఇక డీజిల్ ధరలు కాస్త అందుబాటులోనే ఉన్నా, మోటార్ వాహన చట్టంలో ప్రభుత్వం తెచ్చిన నిబంధనల కారణంగా దేశంలో డీజిల్ కార్ల తయారీ అధిక వ్యయంతో ముడిపడి ఉంది. ఈక్రమంలో వినియోగదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతుంది. ఇప్పటికే పలు రకాల ఎలక్ట్రిక్ వాహనాలు భారత ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. బడ్జెట్ ల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. భారత్ లో విద్యుత్ వాహనాల అమ్మకాలకు కరోనా కాలం కలిసొచ్చిందంటూ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం అమ్ముడవుతున్న ప్రతి 20 కార్లాలో ఒకటి మాత్రమే విద్యుత్ వాహనం కాగా, రానున్న 2022 నుంచి ఆ నిష్పత్తి పెరిగే అవకాశం ఉందంటూ మార్కెట్ పండితులు పేర్కొంటున్నారు. మరి బడ్జెట్ వారీగా భారత్ లో ఉన్న టాప్ విద్యుత్ కార్లు, వాటి విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

టాటా టీగోర్ ఈవీ: భారత్ లో తయారై, అమ్ముడవుతున్న విద్యుత్ కార్లలో టాటా వారి టీగోర్ ఈవీ అగ్రస్థానంలో ఉంది. బిల్ట్ ఇన్ బ్యాటరీతో వస్తున్న ఈకారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 213 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. కమర్షియల్, పర్సనల్ గానూ ఉపయోగించుకోగలిగిన ఈకారు ధర Rs 12-13 లక్షలు.
టాటా నెక్సన్: ఇక టాటా నుంచే వచ్చిన మరో విద్యుత్ వాహనం టాటా నెక్సన్ ఈవీ. కాంపాక్ట్ ఎస్యూవీ డిజైన్ గా వస్తున్న ఈకారు, ఇండియాలో తయారై, అత్యధిక అమ్మకాలు నమోదు చేస్తున్న విద్యుత్ కార్లలో టాటా నెక్సన్ ప్రధమ స్థానంలో ఉంది. పూర్తిగా ఫ్యామిలీ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసిన ఈకారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ టాటా నెక్సన్ ఈవీ ధర Rs 14లక్షలు.

Also Read: Car updates in India: మారుతీ సుజుకి నుంచి త్వరలో రానున్న కొత్త కార్లు

MG ZS EV: బ్రిటిష్ – చైనా కార్ల సంస్థ మోరిస్ గ్యారేజెస్ “ఎంజీ” నుంచి వచ్చిన ప్రీమియం కాంపాక్ట్ ఎస్యూవీ ఈ ZS EV. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 419 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉన్న ఈ కారు ధర Rs 21-25 లక్షలుగా ఉంది. కారు ధర కొంచెం అధికంగానే ఉండగా, అందులోని ఫీచర్స్ సైతం అద్బుతంగా ఉన్నాయంటూ సంస్థ పేర్కొంది. హ్యుందాయ్ కోనా: భారత్ లో రెండో అతిపెద్ద కారు తయారీదారుగా అవతరించిన హ్యుందాయ్ సంస్థ, ఇప్పుడప్పుడే బడ్జెట్ సెగ్మెంట్ విద్యుత్ వాహనాలను తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు లేదు. హ్యుందాయ్ నుంచి భారత్ లో అమ్ముడవుతున్న విద్యుత్ వాహనం కోనా. ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్ లో కోనా అమ్మకాలు కాస్త పర్వాలేదనిపిస్తున్నాయి. కంపెనీ బ్రాండ్ ఇమేజ్ మీద రానున్న ఏడాది మరిన్ని ఈవీ మోడల్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ లో అమ్ముడవుతున్న హ్యుందాయ్ కోనా ఈవీ వాహన ధర Rs 33.79 లక్షలు ఉండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 452 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇవే కాక సూపర్ ప్రీమియం సెగ్మెంట్ లో ఆడి, బీఎండబ్ల్యూ, బెంజ్ కార్లు వినియొ 2022లో వినియోగదారులకు అందుబాటులో రానున్నాయి.

Also read: Robo cinema to become true: మనిషి చేయిని పట్టుకుని విదిలించిన “మరమనిషి”: రోబో సినిమా నిజం కానున్నదా?