Car updates in India: మారుతీ సుజుకి నుంచి త్వరలో రానున్న కొత్త కార్లు

ప్రస్తుతం ఉన్న కార్లకు మెరుగులద్ది కొత్తగా మార్కెట్లోకి తీసుకురావడం సహా, మరికొన్ని కొత్త మోడల్స్ కు భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు మారుతీ సుజుకి సిద్ధమైంది

Car updates in India: మారుతీ సుజుకి నుంచి త్వరలో రానున్న కొత్త కార్లు

Untitled(3)

Car updates in India: కరోనా కారణంగా కార్ల అమ్మకాల్లో నెలకొన్న అనిశ్చితి వలన గత రెండున్నరేళ్లుగా మార్కెట్లో కొత్త కార్లను తీసుకురాని భారత కార్ల దిగ్గజం మారుతి సుజుకి, రానున్న 2022 సంవత్సరానికి గానూ పక్కా ప్రణాళికతో వ్యవహరించనుంది. 2022 సంవత్సరంలో తన పోర్ట్ ఫోలియోను మరింత విస్తరించేందుకు సుజుకి ఇండియా సన్నాహాలు చేసింది. ఈమేరకు ప్రస్తుతం ఉన్న కార్లకు మెరుగులద్ది కొత్తగా మార్కెట్లోకి తీసుకురావడం సహా, మరికొన్ని కొత్త మోడల్స్ కు భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు మారుతీ సుజుకి సిద్ధమైంది. 2021 చివరలో వచ్చిన కొత్త సెలెరియో సహా, రానున్న సంవత్సరానికి 4-5 ఫేస్ లిఫ్ట్ మోడల్స్ ను మారుతీ సుజుకి ప్రవేశపెట్టనుంది. మరి కొత్తగా మారుతీ నుంచి రానున్న ఆ మోడల్స్ ఏమిటో చూద్దాం.

మారుతీ సుజుకి నుంచి ముందుగా రానున్న కారు బాలెనో హ్యాచ్ బ్యాక్. ప్రీమియం సెగ్మెంట్ లో మారుతీ సంస్థ నుంచి వచ్చిన బాలెనొ హ్యాచ్ బ్యాక్.. మార్కెట్లో ఇన్స్టాంట్ హిట్ అయింది. అయితే గత కొన్ని రోజులుగా ఈకారు నుంచి మేజర్ అప్డేట్ లేదు. ఈసెగ్మెంట్ లో మిగతా బ్రాండెడ్ కార్ల నుంచి ఫేస్ లిఫ్ట్ మోడల్స్ రాగా, సుజుకి నుంచి మాత్రం అప్డేట్ లేదు. దీంతో 2022లో మొట్టమొదటగా బాలెనొ ఫేస్ లిఫ్ట్ తీసుకురానుంది సుజుకి. బాలెనొ తరువాత మారుతీ నుంచి రానున్న మరో అప్డేట్ వితారా బ్రెజా. కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లో దేశీయంగా బ్రెజా అమ్మకాలు భేష్. బ్రెజా నుంచి కూడా గత కొన్ని రోజులుగా ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో, వినియోగదారులు ఇతర బ్రాండ్స్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఈ సెగ్మెంట్ లో కియా సొనెట్, హ్యుండై వెన్యూ, టాటా నెక్సన్, మహీంద్రా ఎక్స్యూవీ 300 కార్లు జోరుమీదున్నాయి. రానున్న ఏడాదిలో సుజుకి తన బ్రెజాలో ఫేస్ లిఫ్ట్ తీసుకువస్తే ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Robo cinema to become true: మనిషి చేయిని పట్టుకుని విదిలించిన “మరమనిషి”: రోబో సినిమా నిజం కానున్నదా?

ఇక మారుతీ సుజుకి నుండి 2022లో రానున్న మరో కొత్త అప్డేట్ “ఆల్టో”. మారుతీ బ్రాండ్ కి పెట్టింది పేరైన ఆల్టోలో చిన్న చిన్న మార్పులు తప్ప, ఈమధ్య కాలంలో మేజర్ గా చెప్పుకోవడానికి ఏమిలేదు. అందుకే ఈసారి కారు పూర్తి స్వరూపాన్ని మార్చి, కొత్తగా భారత మార్కెట్లోకి విడుదల చేసేలా సుజుకి ఇండియా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే “ఆల్టో”లో కొత్త మోడల్ జపాన్ దేశంలో విడుదల కాగా, అదే కారును మార్పులు చేర్పులు చేసి భారత్ లోనూ విడుదల చేయాలనీ సుజుకి ఇండియా భావిస్తుంది. మారుతీ నుండి రానున్న మరో మేజర్ అప్డేట్ ఎక్సెల్6. ఎర్టిగా కారుకు స్పోర్ట్స్ వేరియంట్ గా చెప్పుకునే ఎక్సెల్6 కారు 2022లో సరికొత్త హంగులతో విడుదల కానుంది. మోడల్ ఫీచర్స్ కూడా ఇప్పటికే ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక సుజుకి ఇండియా నుంచి 2022లో అత్యధిక మంది ఎదురు చూస్తున్న అప్డేట్ ఎస్-క్రాస్”. కాంపాక్ట్ ప్రీమియం సెగ్మెంట్ లో సుజుకి ఇండియా సంస్థ తయారు చేసిన ఎస్-క్రాస్ భారత్ నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న కార్లలో ఒకటి. రానున్న సంవత్సరానికి ఎస్-క్రాస్ లో కూడా మేజర్ అప్డేట్ వస్తుందని కొన్ని దేశీయ కార్ రివ్యూ సంస్థలు పేర్కొన్నాయి. ఇవి దేశీయ కార్ల దిగ్గజం సుజుకి ఇండియా నుంచి రానున్న ఐదు కార్లు.

Also Read: New Smartphone from VIVO: రంగులు మారే బ్యాక్ ప్యానెల్ తో వస్తున్న వివో “V23”