New Smartphone from VIVO: రంగులు మారే బ్యాక్ ప్యానెల్ తో వస్తున్న వివో “V23”

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో, 2022 నూతన సంవత్సరాన్ని సరికొత్త స్మార్ట్ ఫోన్ తో స్వాగతం పలకనుంది. సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ "వీ23"ని భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది వివో

New Smartphone from VIVO: రంగులు మారే బ్యాక్ ప్యానెల్ తో వస్తున్న వివో “V23”

Vvio V23 Sereis

New Smartphone from VIVO: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో, 2022 నూతన సంవత్సరాన్ని సరికొత్త స్మార్ట్ ఫోన్ తో స్వాగతం పలకనుంది. సరికొత్త స్మార్ట్ ఫోన్ సిరీస్ “వీ23″ని భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది వివో. జనవరి 5 2022 మధ్యాహ్నం 12 గంటలకు తమ సరికొత్త వీ23 సిరీస్ ను భారత \మార్కెట్లోకి విడులా చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. సాంకేతిక పరంగా క్షణాల వ్యవధిలో మారిపోతున్న స్మార్ట్ ఫోన్ మార్కెట్లో.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు వివో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకువస్తుంది. ప్రస్తుతం అన్ని స్మార్ట్ ఫోన్ లలో ఉన్న అత్యాధునిక ఫీచర్స్ తో పాటు, మరింత ఆకర్షణీయమైన ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉంటాయని వివో పేర్కొంది. త్వరలో మరో పది రోజుల్లో విడుదల కానున్న ఈ వీ23 సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ గురించి పూర్తి సమాచారం కంపెనీ వెల్లడించనప్పటికీ, కొన్ని టెక్ రివ్యూ వెబ్ సైట్లు మాత్రం ఫోన్ గురించిన కొన్ని విషయాలు రాబట్టాయి. జిఎస్ఎం అరేనా వెబ్ సైట్ తెలిపిన వివరాలు మేరకు…

వివో వీ23 సిరీస్ లో, రెండు ఫోన్ లు ఉండనున్నాయి. V23 5G, V23 Pro 5G, స్మార్ట్ ఫోన్ లు భారత్ లో విడుదల కానున్నాయి. వీటిలో V23 5G ఫోన్ లో ప్రధాన ఆకర్షణగా 50ఎంపీ “Eye auto focus”తో కూడిన కెమెరా, జంట సెల్ఫీ కెమెరా ఉండగా, V23 Pro 5G ఫోన్ లో 64ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే విషయానికి వస్తే అత్యంత సన్నని “Ultra slim 3D curved display”ను ఈఫోన్లలో అమర్చారు. ఇక ఈ ఫోన్ లలో ప్రధాన ఆకర్షణగా రంగులు మారే బ్యాక్ ప్యానెల్ అమర్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన గ్లాస్ ప్యానెల్ పై సూర్య కిరణాలు పడినప్పుడు గోల్డ్ రంగులో ఉండే బ్యాక్ ప్యానెల్ నీలం రంగులోకి మారుతుంది. ఇలా రంగులు మారే బ్యాక్ ప్యానెల్ ఇండియన్ మార్కెట్లో మొట్టమొదటిసారిగా తమ సంస్థ నుంచే వస్తుందని వివో ఒక ప్రకటనలో పేర్కొంది.

Also Read: Indian Army: అత్యాధునిక భద్రతతో కూడిన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసిన ఇండియన్ ఆర్మీ

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వివో తమ ఫోన్లను భారత్ లోనే తయారు చేస్తుంది. ఇక్కడి నుండే పశ్చిమాసియా దేశాలకు సైతం ఎగుమతి చేస్తుంది. మార్కెట్ పరంగా భారత్ తమకు ఎంతో ముఖ్యమని చెప్పుకొస్తున్న వివో, భవిష్యత్ లో భారత వినియోగదారులను ఆకట్టుకునేందుకు అత్యాధునిక ఫీచర్స్ తో కూడిన స్మార్ట్ ఫోన్ లను తేనున్నట్లు తెలిపింది. కాగా ఇండియాలో క్రికెట్ ఐపీఎల్, ప్రో కబడ్డీ సహా ఇతర ఆటలకు ప్రస్తుతం వివో టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Also read: Rowdy Boy Vijay Devarakonda : విజయ్ దేవరకొండ మంచి మనస్సు..పేదవారికి రూ. 10 లక్షల సహాయం