Indian Army: అత్యాధునిక భద్రతతో కూడిన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసిన ఇండియన్ ఆర్మీ

దేశ భద్రతకు సంబంధించి భారత సైన్యం వద్దనున్న అంతర్గత సమాచారం శుత్రు దేశాలకు బహిర్గతమైన ఘటనలను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం సరికొత్త సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసింది.

Indian Army: అత్యాధునిక భద్రతతో కూడిన సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసిన ఇండియన్ ఆర్మీ

Asigma

Indian Army: శత్రుమూకల వివరాలు, దేశ భద్రతకు సంబంధించి భారత సైన్యం వద్దనున్న అంతర్గత సమాచారం శుత్రు దేశాలకు బహిర్గతమైన ఘటనలను దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం సరికొత్త సమాచార వ్యవస్థను అభివృద్ధి చేసింది. అసిగ్మా(Army Secure IndiGeneous Messaing Application, ASIGMA)గా పిలువబడే ఈ వెబ్ ఆధారిత అప్లికేషన్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో సైన్యం అభివృద్ధి చేసింది. సాధారణ ప్రజలు వినియోగించే “వాట్సాప్”లాగానే ఈ “అసిగ్మా” పనిచేస్తుంది. అయితే కేవలం సైన్యంలో సమాచార పంపిణీ కొరకు మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. సైన్యానికి సంబంధించి అంతర్గతంగా సమాచారాన్ని చేరవేసేందుకు మాత్రమే ఉపయోగించే ఈవ్యవస్థను భారత సైన్యంలోని “కార్ప్స్ ఆఫ్ సిగ్నల్స్ ఇన్-హౌస్” సభ్యులు అభివృద్ధి చేసారు. గత 15 ఏళ్లుగా ఆర్మీ ఉపయోగించిన ఆర్మీ వైడ్ ఏరియా నెట్‌వర్క్ (AWAN) మెసేజింగ్ వ్యవస్థ స్థానంలో ప్రస్తుతం అభివృద్ధి చేసిన అసిగ్మాను ఉపయోగిస్తారు.

Also Read: Omicron : ఏపీలో కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

భవిష్యత్ అవసరాలను సైతం దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక అనువర్తన వ్యవస్థ, హార్డ్‌వేర్ కంప్యూటర్ పరిజ్ఞానం మారినప్పటికీ వాటికనుగుణంగా పనిచేసే విధంగా తయారు చేసారు. ఇక మున్ముందు వచ్చే ఎటువంటి సైబర్ దాడుల నుంచైనా తట్టుకునే విధంగా అనేక అంచెలతో కూడిన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసారు. మెసేజ్ ప్రాధాన్యత, నిఘా, మార్పిడికి సాద్యపడని అడ్రెస్స్ బుక్, ఇలా ఎన్నో ప్రత్యేకతలతో కూడిన సమాచార వ్యవస్థను ఇండియన్ ఆర్మీ అభివృద్ధి చేసింది.

Also Read: Omicron Effect on Films: టెన్షన్.. టెన్షన్.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో?!

“మేక్ ఇన్ ఇండియా”లో భాగంగా అభివృద్ధి చేసిన ఈ “అసిగ్మా” సమాచార వ్యవస్థలో ఆర్మీ అవసరాలను పరిపూర్ణం చేస్తుందని అధికారులు ఇటీవల ఒక ప్రకటనలో పేర్కొన్నారు. “కాగిత రహిత” కార్యసాధన దిశగా అడుగులేస్తున్న తమకు, ప్రస్తుతమున్న అనేక కమ్యూనికేషన్ అప్లికేషన్లకు తోడు, అసిగ్మా(ASIGMA)తో సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. తక్షణ సందేశ పంపిణీ నిమిత్తం అభివృద్ధి చేసిన అంతర్జాల ఆధారిత వ్యవస్థలో అసిగ్మా ఎంత దృఢమైన రక్షణ వ్యవస్థ కలిగి ఉంది.