Omicron : ఏపీలో కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరింది.

Omicron : ఏపీలో కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు

Omicron

Omicron : ఏపీలో మరో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6కు చేరింది. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన 48ఏళ్ల వ్యక్తి కొద్దీ రోజుల క్రితం దక్షిణాఫ్రికా నుంచి వచ్చాడు. ఇతడికి వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా ఒమిక్రాన్ పాజిటివ్ నిర్దారణ అయింది.

చదవండి : Omicron : పండగలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్…ప్రపంచవ్యాప్తంగా 5,700లకు పైగా ఫ్లైట్స్ రద్దు

అనంతపురంకి చెందిన 51 ఏండ్ల వ్యక్తి యూకే నుంచి ఇండియాకు వచ్చాడు. అతడికి పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్ నిర్దారణ అయింది. దీంతో వీరిద్దరిని ఆసుపత్రికి తరలించారు. వీరి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని తేలింది.

చదవండి : Omicron Cases : ఒమిక్రాన్ ఫియర్.. ఢిల్లీ, ముంబైల్లో భారీగా పెరిగిన కేసులు

ఇక దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 417కి చేరింది. మహారాష్ట్రలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. ఆ తర్వాత స్థానాల్లో ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ ఉన్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రికాషన్ డోస్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక 15 నుంచి 18 ఏళ్ల మధ్య టీనేజర్లకు టీకా కార్యక్రమం ప్రారంభించనున్నారు.

చదవండి : Omicron Effect on Films: కలెక్షన్ల డ్రాప్.. రిలీజైన సినిమాలకు ఓమిక్రాన్ కష్టాలు!