Omicron : పండగలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్…ప్రపంచవ్యాప్తంగా 5,700లకు పైగా ఫ్లైట్స్ రద్దు

యూకే, ఫ్రాన్స్, ఇటలీ, యూఎస్‌లో కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవాణా స్తంభించిపోయింది. ముందు జాగ్రత్తగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు.

Omicron : పండగలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్…ప్రపంచవ్యాప్తంగా 5,700లకు పైగా ఫ్లైట్స్ రద్దు

New Project

Updated On : December 26, 2021 / 8:04 AM IST

Omicron effect on festivals : ఒమిక్రాన్ వైరస్ పండగలను కూడా మింగేస్తోంది. ప్రజలకు సంతోషం లేకుండా చేస్తోంది. ఒమిక్రాన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రిస్టియన్లు క్రిస్మస్ సంబరాలు కూడా సెలబ్రేట్ చేసుకోలేకపోయారు. అమెరికా నుంచి యూరోప్ వరకు అన్ని దేశాల్లో ఒమిక్రాన్ ఆంక్షలను విధించడంతో ఆ ప్రభావం క్రిస్మస్ సంబరాలపై పడింది. ప్రపంచవ్యాప్తంగా 5వేల 700లకు పైగా ఫ్లైట్స్ రద్దు కావడంతో ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లలేకపోయారు.

యూకే, ఫ్రాన్స్, ఇటలీ, యూఎస్‌లో కోవిడ్ కేసుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో రవాణా స్తంభించిపోయింది. ముందు జాగ్రత్తగా జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు. అత్యధిక సంఖ్యలో చైనా శుక్ర, శని వారాల్లో వెయ్యి విమానాలను రద్దు చేసింది. అమెరికాలో దాదాపు 8వందల 70 వరకు విమానాలను రద్దు చేశారు. చివరి నిమిషయంలో ప్రయాణికులకు సమాచారం అందడంతో ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయారు.

Covid Positive : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ రంజిత్‌రెడ్డికి కోవిడ్‌ పాజిటివ్‌

అమెరికాలో కొత్తగా వెలుగుచూస్తున్న కోవిడ్ కేసుల్లో 70 శాతానికి పైగా ఒమిక్రాన్ కేసులే ఉండటంతో బైడెన్ ప్రభుత్వం… కోవిడ్ మొదటి వేవ్ తరహాలో ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాలపై బ్యాన్ విధించింది. దీంతో అమెరికాలో వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణించాలనుకున్న వాళ్లు.. అమెరికా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకున్న వాళ్లు… అమెరికాకు ఇతర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్లు…ఆగిపోయారు.