Trisha Krishnan : ‘అజిత్-విజయ్’లో నెంబర్ వన్ ఎవరన్నది తెలిపిన త్రిష..

హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి ఇటీవలే 20 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. ఈ భామ తాజాగా నటిస్తున్న 'రాంగి' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతుంది. ఇలా ఒక ఇంటర్వ్యూలో 'అజిత్-విజయ్'లో నెంబర్ వన్ ఎవరన్నది తెలియజేసింది.

Trisha Krishnan : ‘అజిత్-విజయ్’లో నెంబర్ వన్ ఎవరన్నది తెలిపిన త్రిష..

Trisha said who is number one in Ajith and Vijay

Trisha Krishnan : హీరోయిన్ త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి ఇటీవలే 20 ఏళ్ళు పూర్తీ చేసుకుంది. 50కి పైగా సినిమాల్లో నటించిన ఈ భామ సౌత్‌లో ఇంకా స్టార్ హీరోయిన్ హోదాని అనుభవిస్తుంది. ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ సినిమాతో పాన్ ఇండియా హిట్టుని అందుకున్న త్రిష.. ఇప్పుడు మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. త్రిష మెయిన్ లీడ్‌లో నటిస్తూ ‘రాంగి’ అనే యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌తో డిసెంబర్ 30న థియేటర్లోకి రానుంది.

Vijay : 1990లో ఆ నటుడు నాకు గట్టి పోటీ ఇచ్చాడు.. విజయ్!

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్న త్రిష.. ఒక ఇంటర్వ్యూలో ‘అజిత్-విజయ్’లో నెంబర్ వన్ ఎవరన్నది తెలియజేసింది. కొన్ని రోజులు క్రిందట విజయ్ ‘వారిసు’ సినిమాని నిర్మిస్తున్న తెలుగు నిర్మాత దిల్ రాజు.. తమిళనాట అజిత్ కంటే విజయ్ పెద్ద స్టార్ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపాయి. ఇక ఈ స్టేట్‌మెంట్‌తో ఫ్యాన్ వార్స్ మొదలు కాగా, ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.

ఈ క్రమంలోనే త్రిషని ఈ కాంట్రవర్సి గురించి ప్రశ్నించగా, ఆమె బదులిస్తూ.. “నేను ఈ నెంబర్ గేమ్స్‌ని అసలు నమ్మను. నెంబర్ వన్ అనేది వాళ్ళు చివరిగా నటించిన సినిమా మీద ఆధారపడి ఉంటది. లాస్ట్‌గా రిలీజ్ అయ్యిన మూవీ బాగా ఆడితే, అప్పటికి ఆ హీరోనే నెంబర్ వన్. ఆ తరువాత మరో హీరో మూవీ అంతకంటే బాగా ఆడితే ఆ హీరో నెంబర్ వన్. నెంబర్ వన్ పొజిషన్ అనేది సినిమా సినిమాకి మారిపోతుంది” అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేసింది.