Delhi Air Pollution: టీవీ డిబేట్స్ కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి: సీజేఐ వ్యాఖ్యలు

చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV రమణ టీవీ డిబేట్స్ 'సందర్భం లేని ప్రకటనలను ప్రసారం'పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. టీవీలో పెడుతున్న చర్చలు అందరికంటే ఎక్కువ కాలుష్యాన్ని.....

Delhi Air Pollution: టీవీ డిబేట్స్ కాలుష్యాన్ని మరింత పెంచుతున్నాయి: సీజేఐ వ్యాఖ్యలు

Air Pollution

Delhi Air Pollution: చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా NV రమణ టీవీ డిబేట్స్ ‘సందర్భం లేని ప్రకటనలను ప్రసారం’పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. టీవీలో పెడుతున్న చర్చలు అందరికంటే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయని జస్టిస్ రమణ అన్నారు. కోర్టుల చిన్న చిన్న పరిశీలనలు కూడా వివాదాస్పద అంశాలుగా మారుతున్నాయని అన్నారు.

ఢిల్లీ వాయు కాలుష్యంపై ఓ విద్యార్థి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) సందర్భంగా జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు. “మీరు ఏదో ఒక సమస్యను ఉపయోగించుకుని.. ఫోకస్ మొత్తం మీ వైపు తిప్పుకుని కాంట్రవర్సీగా మార్చాలనుకుంటున్నారు. చివర్లో ఆరోపణలు మాత్రమే మిగులుతాయి. టీవీల్లో డిబేట్స్ అందరికంటే ఎక్కువ కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయి’

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా టీవీ డిబేట్స్ అంశాన్ని లేవనెత్తారు. ఢిల్లీ కాలుష్యం గురించి చర్చించకుండా సుప్రీం కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని.. వ్యాఖ్యానించడంతో ఎవరూ మమ్మల్ని మిస్‌లీడ్ చేయలేదు.

………………………………………… : మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం-వ్యక్తి మృతి

రైతులు గడ్డివాము తగలబెట్టడంతో కాలుష్యం ఏర్పడిందని, కొందరేమో పటాసులు కాల్చడం వల్ల జరిగిందని చెప్పుకొచ్చారు. సీజేఐ అధ్యక్షతన బెంచ్ లో ఒకరైన జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. ‘రైతుల వరకూ ఎంతవరకూ కాలుష్యం జరిగిందనేది పక్కకుపెడితే.. వాళ్లు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని ఆలోచించారా’ అని ప్రశ్నించారు.

‘5స్టార్, 7 స్టార్ సౌకర్యాలు అనుభవిస్తూ.. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం జరిగిందంటూ ఆరోపిస్తున్నారు. వాళ్లు ఎక్కడ ఉంటున్నారో తెలుసా.. వెళ్లి వాళ్లకు ఏదైనా సైంటిఫిక్ ప్రోసెస్ ఉంటే చెప్పండి’ అన్నారు. జడ్జి వ్యాఖ్యలను సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి అంగీకరించారు.

ఢిల్లీ గాలి కాలుష్యానికి దీపావళి పటాసులు పేల్చడం కారణం కాదు. ఐఐటీ కాన్పూర్ స్టడీ జరిపి ఢిల్లీ గవర్నమెంట్ కు రిపోర్ట్ ఇచ్చింది. ‘నా మొబైల్ లో ఆ స్టడీ గురించి చదివాను. దాని ప్రకారం.. దీపావళి టపాసులు ఢిల్లీ కాలుష్యానికి కారణం కాదని ఉంది. తాత్కాలికంగా కొంతకాలం పాటు అలా ఉంటుందని స్టడీలో తేలింది. 15రోజులుగా క్రాకర్స్ పేల్చొద్దని నిషేదం విధిస్తే.. కాల్చకుండా ఎన్ని ఆగాయో తెలుసా.. ‘

…………………………………. : ఘోరం… ప్రాణం తీసిన నిర్లక్ష్యం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో

‘ఏటా అక్టోబర్-నవంబర్ నెలల్లో ఢిల్లీకి ఈ సమస్య ఉంటుంది. సుప్రీం కోర్టు దీనిపై చర్చిస్తూనే ఉంది. ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఇక్కడే ఉన్నాయి కదా’ అని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సిఎక్యూఎం) ఈ ప్రాంతంలో గాలి నాణ్యతను మెరుగుపరచడానికి ఆదేశాలు జారీ చేసిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు.