Ugadi Celebration : ప్రగతి భవన్‌‌లో ఉగాది వేడుకలు.. కేసీఆర్ ఛలోక్తులు

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు అన్నీ తీరాయని, 75 సంవత్సర భారత్ లో నూతన ఆవిష్కరణలు, ఏ రాష్ట్రం సాధించని ఫలితాలు తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు. ఇందులో అధికారుల పాత్ర...

Ugadi Celebration : ప్రగతి భవన్‌‌లో ఉగాది వేడుకలు.. కేసీఆర్ ఛలోక్తులు

Ugadi Kcr

Pragathi Bhavan CM KCR Speech : ప్రగతి భవన్ లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ పఠనం చేశారు. వేద పండితులు సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ….మాస్క్ ల బాధ లేదని, కరోనా పీడ విరుగుతుందని పంచాంగంలో ఉండడం సంతోషకరమన్నారు. ఈ సంవత్సరంలో అందరికీ సుఖం, శాంతి, ఐశ్వర్యం, శుభం కలుగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాల సుదీర్ఘపోరాటం అనంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు. ఎన్ని సందేహాలు, ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని.. అవన్నీ గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణ జాతి అంతా ఒక్కటేనని, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడం జరిగిందన్నారు.

Read More : CM KCR : దేశం మొత్తం కేసీఆర్‌‌ను చూస్తుంది… విశ్వరూపం చూస్తారు – బాచంపల్లి సంతోష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు అన్నీ తీరాయని, 75 సంవత్సర భారత్ లో నూతన ఆవిష్కరణలు, ఏ రాష్ట్రం సాధించని ఫలితాలు తెలంగాణ రాష్ట్రం సాధించిందన్నారు. ఇందులో అధికారుల పాత్ర కీలకమన్నారు. 23 జిల్లాల సమైక్య రాష్ట్రాన్ని ఎప్పుడో మించిపోయామని, లక్ష 77 వేల కోట్ల 630 రూపాయలు ఉందని రిజర్వ్ బ్యాంకు తేల్చిందని అధికారులు చెప్పారన్నారు. కొన్ని దుష్టశక్తులు బేదాభిప్రాయాలు సృష్టించాలని అనుకున్నా.. అవి నెరవేరలేదన్నారు. మిషన్ భగీరథ ద్వారా అద్భుతమైన సంపదను సృష్టించగలిగామని, మారుమూల ప్రాంతానికి వెళ్లినా.. భూమి విలువ అమాంతం పెరిగిందన్నారు.

Read More : Telangana : గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య పెరుగుతున్న దూరం

హైదరాబాద్ లో రూ. 25 కోట్లతో విల్లాలు బుక్ చేసుకొనే పరిస్థితి నెలకొందని, దళిత బంధు అద్భుతాలు ఆవిష్కరించబోతోందన్నారు. 95 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని గుర్తు చేశారు. అందరి అభ్యుదయం ప్రతొక్కరి అభిమతం కావాలని కోరుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ తో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.