CM KCR : దేశం మొత్తం కేసీఆర్‌‌ను చూస్తుంది… విశ్వరూపం చూస్తారు – బాచంపల్లి సంతోష్ కుమార్

ఈ సంవత్సరం అంతా బాగానే ఉందని, సీఎం కేసీఆర్ మంచి పాలన అందిస్తారన్నారు. రైతులు రాజులు కాబోతున్నట్లు.. పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు...

CM KCR : దేశం మొత్తం కేసీఆర్‌‌ను చూస్తుంది… విశ్వరూపం చూస్తారు – బాచంపల్లి సంతోష్ కుమార్

Ugadi

Panchanga Sravanam In Pragathi Bhavan : దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తుందని, ఆయన త్వరలోనే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి వెల్లడించారు. ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టినా.. అయినా.. ముందుకు వెళుతారని తెలిపారు. వేములవాడ రాజరాజేశ్వరుడు, యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి అనుగ్రహం, ధర్మపురి లక్ష్మీ నరసింహుడి చల్లని చూపు ఆయనపై ఉంటుందన్నారు. ఈ సంవత్సరం సాహసోపేతమైన వంటి నిర్ణయాలు వెలువడుతాయని.. గురువు గ్రోచారం అనుకూలంగా ఉందన్నారు.

Read More : గవర్నర్ సీఎం మధ్య పెరుగుతున్న దూరం

2022, ఏప్రిల్ 02వ తేదీ శనివారం ప్రగతి భవన్ లో శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్ తో పాటు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాచంపల్లి సంతోష్ కుమార్ పంచాంగ పఠనం చేశారు. ఈ సంవత్సరం అంతా బాగానే ఉందని, సీఎం కేసీఆర్ మంచి పాలన అందిస్తారన్నారు. రైతులు రాజులు కాబోతున్నట్లు.. పంటలు సమృద్ధిగా పండుతాయన్నారు.

Read More : Bhadradri : నేటి నుండి భద్రాద్రి రాములోరి బ్రహ్మోత్సవాలు.. భద్రాచలంకు 350 ప్రత్యేక బస్సులు

కేసీఆర్ విశ్వరూపాన్ని చూపిస్తారని, సింహ రాశికి మిశ్రమ ఫలితాలున్నాయన్నారు. ప్రతొక్కరూ దేవుడిని ప్రార్థించాలని, తెలంగాణలో ఉన్న దేవాలయాలను సందర్శించాలని ప్రజలకు సూచించారు. చీకటి రాత్రులు తొలగిపోయాయని, శుభకృత్ మొదలైందన్నారు. యాదాద్రి దర్శనంతో ఈ సంవత్సరం ఆరంభమైందని, వేములవాడ రాజన్న వెలిగిపోతాడని తెలిపారు. అందరికీ ఉత్సవాలు మొదలయినట్లు.. ఆన్ లైన్ క్లాసులు ఉండవని, కరోనా రోద ఉండదన్నారు. మొత్తంగా ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోందని పంచాంగం చెబుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చాలా మంచి జరుగుతుందని, పరిపాలన అత్యద్భుతంగా ఉండబోతోందని బాచంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు.