Boy Dead : భగత్​ సింగ్​ను ఉరితీసే నాటకం రిహార్సల్స్..ప్రాణాలు కోల్పోయిన బాలుడు

భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ పాత్రను అనుకరించే క్రమంలో ఓ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.భగత్ సింగ్ ను ఎలా ఉరి తీశారో అలా ఉరి తీసే నాటకం వేయటానికి రిహార్సల్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.

Boy Dead : భగత్​ సింగ్​ను ఉరితీసే నాటకం రిహార్సల్స్..ప్రాణాలు కోల్పోయిన బాలుడు

Up 9 Years Boy Hanging

9 Years boy Dies After Mimicking Bhagat Singh Hanging: భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15 సమీపిస్తోంది. ఈసందర్భంగా భరతమాత ముద్దుబిడ్డ భగత్ సింగ్ పాత్రను అనుకరించే క్రమంలో ఓ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.భగత్ సింగ్ ను ఎలా ఉరి తీశారో అలా ఉరి తీసే నాటకం వేయటానికి రిహార్సల్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు తొమ్మిదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.భగత్ సింగ్ ను ఉరి తీసే నాటకం రిహార్సల్స్ చేస్తుండగా శివమ్ అనే ఓ 9 ఏళ్ల విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.

బుదౌన్ జిల్లాలోని బబత్ గ్రామంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్కూల్ లో భగత్ సింగ్ నాటకం వేయాలని 9ఏళ్ల శివమ్ అనే విద్యార్ధి..అతని స్నేహితులు అనుకున్నారు. ఈ నాటకంలో భగత్ సింగ్ పాత్రను శివమ్ వేయాలని నిర్ణయం జరిగింది. ఈ నాటకం చివర్లో భగత్ సింగ్ ఉరి తాడును ముద్దు పెట్టుకుని ఉరి తాడును మెడకు తనకు తానే తగిలించుకునే ఘట్టం ఉంది. సీన్ రిహార్సల్స్ కోసం శివమ్ ఓ తాడును కూడా తీసుకొచ్చాడు. ఓ స్టూల్ వేసి ఆ తాడును పైన కట్టారు. తరువాత శివమ్ స్టూల్ పైకి ఎక్కి ఆ తాడుని ఉరి తాడుగా కట్టి మెడకు చుట్టుకున్నాడు అచ్చు భగత్ సింగ్ లో ఫోజులిచ్చాడు. ఆ తరువాత ఉరి వేసుకుంటున్నట్లుగా నటించాలనుకున్నాడు.

దాంట్లో భాగంగానే తాడును మెడకు తగించుకున్నాడు.కానీ అప్పుడే జరగరానిది జరిగిపోయింది. ప్రమాదవశాత్తు స్టూల్ నుంచి శివమ్ కాళ్లు జారాయి. అంతే తాడు మెడకు చుట్టుకుని ఉరిలా బిగుసుకుపోయింది.అంతే శివమ్ ఊపిరాడక గిలగిల కొట్టుకుంటుంటుండగా అతని స్నేహితులు చూశారు.చిన్న పిల్లలు కదా..అది ప్రమాదవశాత్తు జరగలేదని తెలుసుకోలేకపోయారు.‘అరె మన శివమ్ అచ్చు భగత్ సింగ్’ లాగా భలే నటిస్తున్నాడే అంటూ చప్పట్లు కొడుతూ చూశారు.శివమ్ ను ప్రోత్సహిస్తున్నామనుకున్నారు. కానీ స్నేహితుడిని పోగొట్టుకుంటున్నామని పాపం ఆపసివాళ్లకు తెలీయలేదు. కానీ శివమ్ లో కదలికలు పూర్తిగా ఆగిపోయాయి. కానీ ఒకేయ్ శివమ్..భలే చేశావురా అంటూ దగ్గరకెళ్లి పట్టుకున్నారు. కానీ శివమ్ లో కదలికలు లేవు.కదిపి చూసినా ఏమాత్రంకదలకపోవటం ఆ పసివాళ్లకు భయం వేసింది.

వెంటనే పరుగు పరుగున వెళ్లి ఈ విషయాన్ని వారి తల్లిదండ్రులకు, చుట్టు పక్కల వారికి చెప్పారు. శివమ్ ఎంత పిలిచినా పలకటం లేదు అంటూ.అంతే ఆ మాట విన్న అంతా పరుగున వచ్చి చూడగా తాడుకు ఉరి బిగుసుకుని చనిపోయిన శివమ్ కనిపించాడు. అంతే ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. శివమ్ తల్లిదండ్రుల శోకానికి అంతే లేదు. వారిని ఎవ్వరూ ఓదార్చలేకపోయారు.

కాగా గత గురువారం (29,7.2021) శివమ్ తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా ఇంట్లో శివమ్ తో పాటు సోదరుడు, సోదరితో ఇంట్లోనే ఉన్నాడు. అదే సమయంలో వారు భగత్ సింగ్ నాటకం రిహాల్సల్స్ చేస్తుండగా చిన్నారి శివమ్ ప్రాణాలు కోల్పోయాడుని శివమ్ మామ వినోద్ కుమార్ తెలిపారు. కాగా, గత ఏడాది మధ్యప్రదేశ్ లోని మంద్సౌర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. బ్రిటీష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్‌ను చంపినందుకు బ్రిటీష్ వలస పరిపాలన ద్వారా అమలు చేయబడిన రాజ్ గురు,సుఖ్‌దేవ్‌ల పాటు భగత్ సింగ్ ను కూడా ఉరివేసిన విషయం తెలిసిందే.