ఆమె బైటకెళ్లకుండా ఉంటే ఈ దారుణం జరిగేది కాదుగా: UP మహిళ అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ మెంబర్ వ్యాఖ్యలు

ఆమె బైటకెళ్లకుండా ఉంటే ఈ దారుణం జరిగేది కాదుగా: UP మహిళ అత్యాచార ఘటనపై మహిళా కమిషన్ మెంబర్ వ్యాఖ్యలు

UP gang rape..NCW member Controversial Comments : ఉత్తరప్రదేశ్‌లోని బదాయులో 50ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి గురైన మహిళ సాయంత్రం వేల బయటకు రాకుండా ఉండి ఉంటే అత్యాచారం జరిగే ఉండేది కాదుగా అంటూ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి వ్యాఖ్యానించపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాదిత మహిళ ఇంటికి పరామర్శకు వెళ్లిన సందర్భంగా చంద్రముఖి ఈ వ్యాఖ్యలు చేయటంపై సాటి మహిళపై ఇటువంటి వ్యాఖ్యలు చేయటం..పైగా మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉంటూ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చంద్రముఖి వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ.. ఆమెను పిలిపించి మాట్లాడి తీవ్రంగా మందలించినట్లుగా తెలుస్తోంది. మహిళలకు ఏ సమయంలో ఎక్కడికి వెళ్లాలన్నా పూర్తి స్వేచ్ఛ ఉందని..వాళ్లు ఎప్పుడైనా..ఎక్కడికైనా వెళ్లే హక్కు వారికి ఉందని అన్నారు.

మహిళా కమిషన్ సభ్యురాలైన చంద్రముఖి బుధవారం బదాయు వెళ్లి బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎవరి నుంచైనా ఒత్తిడి ఉందని భావించినప్పుడు బయట తిరిగే సమయాన్ని గుర్తు పెట్టుకోవాలని..అన్నారు. సాయంత్రం ఆమె బయటకు వెళ్లకపోయి ఉంటే బాగుండేదనీ..కానీ వెళ్లాల్సిన పని ఉంటే ఆమెకు తోడుగా ఎవరైనా తోడు తీసుకువెళ్లుంటే బాగుండేదని అలా చేసి ఉంటే ఆమెపై అత్యాచారం జరిగి ఉండేది కాదని..ఆమె క్షేమంగా తిరిగి ఇంటికి తిరిగి వచ్చుండేది కదా అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చేసింది.

మహిళా కమిషన్ సభ్యురాలిగా ఉంటే ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగుతోంది. మహిళా రక్షణ కోసం ఏర్పాటు చేసిన కమిటీలో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇవేం వ్యాఖ్యలంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ విమర్శలపై స్పందించిన కమిషన్ చైర్మన్ రేఖాశర్మ.. చంద్రముఖిని పిలిపించి వివరణ కోరుతామని..తెలిపారు. ఏ మహిళకైనా వారి వారి వ్యక్తిత్వానికి సంబంధించి సర్వాధికారాలు ఉన్నాయని, స్వేచ్ఛగా బయట తిరిగే హక్కు ఆమెకు ఉందని..మహిళలపై జరుగుతున్న ఇటువంటి దారుణాలకు బాధితులనే నిందించటం అనేది సరైందికాదని అన్నారు.

కాగా గతంతో నిర్భయ ఘటనపై కూడా కొంతమంది నేతలు పలు విధాలుగా వ్యాఖ్యానించారు. ఆమె రేపిస్టులను అన్నయ్యా..అంటూ బతిమాలుకుంటే ఆమెను వదిలేసేవారుగా అని ఒకరంటే..మరొకరు అసలు అంతరాత్రి వేళ ఆమె బైట తిరగటం ఏంటీ అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే..

కాగా..ఉత్తరప్రదేశ్‌లో 50 ఏళ్ల అంగన్వాడీ కార్యకర్త సాయంత్రం సమయంలో దేవాలయానికి వెళ్లిన క్రమంలో ఆమె దారుణ సామూహిక అత్యాచారానికి గురైంది. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన తరువాత ఆ కామాంధులు ఆమె శరీరాన్ని దారుణాతి దారుణంగా హిసించారు. ఆమె శరీరాన్ని ఛిద్రం చేశారు.

ఆమె పక్కటెముకలు విరిచేశారు. రెండు కాళ్లు విరగొట్టారు. అంతకంటే దారుణాతి దారుణంగా ఆమె ప్రైవేటు అవయవాలను దారుణంగా ఛిద్రం చేశారు. ఊపిరి తిత్తుల్లో ఇనుప ఊచలతో దారుణంగా గాయపరిచిన దారుణ ఘటన మరో నిర్భయ ఘటనను తలపించింది. ఈ ఘటనలో ఆలయ పూజారి మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

ఈక్రమంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు బాధిత మహిళ ఇంటికి వచ్చి పరామర్శించిన అనంతరం చంద్రముఖి ఈ వ్యాఖ్యలు చేయటం వివాదానికి దారి తీసింది. ఇటువంటివారిని మహిళా కమిషన్ నుంచి తొలగించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.