UP BJP : బీజేపీ నేత కాళ్లు మొక్కిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవదేశ్‌ కటియార్‌ శ్రీరాముడి ప్రతిమను మోదీకి అందజేశారు. ఆ తర్వాత మోదీ కాళ్లను మొక్కేందుకు యత్నించారు. వెంటనే మోదీ అతన్ని ఆపారు. తన కాళ్లకు నమస్కరించొద్దని

UP BJP : బీజేపీ నేత కాళ్లు మొక్కిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

Modi

PM Modi Feet : అసెంబ్లీ ఎన్నికల హడావుడితో దేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. దేశ ముఖచిత్రమైన యూపీలో గెలవడం అధికార, విపక్ష పార్టీలకు కీలకంగా మారింది. అందుకే ఓటర్ల మనసులను ఆకట్టుకునందుకు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పార్టీల్లోని ప్రముఖ నేతలందరూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ ఉన్నావ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉన్నావ్‌లో బహిరంగ సభకు హాజరయ్యారు ప్రధాని మోదీ. స్టేజ్‌పైకి వచ్చిన ప్రధాని మోదీకి అందరూ స్వాగతం పలికారు.

Read More : PM Modi: 21వ శతాబ్దంలో ఈశాన్య రాష్ట్రాలు దేశాభివృద్ధికి చోదక శక్తిగా నిలుస్తాయి: మోదీ

ఈ క్రమంలో ఉన్నావ్ జిల్లా అధ్యక్షుడు అవదేశ్‌ కటియార్‌ శ్రీరాముడి ప్రతిమను మోదీకి అందజేశారు. ఆ తర్వాత మోదీ కాళ్లను మొక్కేందుకు యత్నించారు. వెంటనే మోదీ అతన్ని ఆపారు. తన కాళ్లకు నమస్కరించొద్దని చెప్పారు. అంతేకాకుండా మోదీ తిరిగి అతని కాళ్లకు నమస్కరించారు. ఈ దృశ్యాన్ని చూసిన అందరూ షాక్ అయ్యారు. దేశానికి ప్రధాని అయినా.. ఒక సామాన్యుడిలా ఉండడమే మోదీ గొప్పతనమని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఎవరైనా తన కాళ్లకు నమస్కరిస్తే.. తిరిగి కాళ్లు మొక్కి ప్రతి నమస్కారం చేయడం మోదీ నైజాం అంటున్నారు. ఈ ఒక్క ఘటన కాదు.. గతంలోనూ కార్యకర్తలు కాళ్లు మొక్కి నమస్కరిస్తే.. తిరిగి మోదీ వాళ్ల కాళ్లు మొక్కిన సందర్భాలూ ఉన్నాయి.

Read More : Afghan Sikhs – Modi: అఫ్గాన్​ సిక్కు- హిందూ ప్రతినిధులతో ప్రధాని మోదీ భేటీ

మరోవైపు…ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ మూడోదశ పోలింగ్‌ ముగిసింది. మూడో విడతలో 16 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు పోలింగ్‌ పూర్తయ్యింది. మొత్తం 57.44 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. యూపీలో అతిపెద్ద నగరాల్లో ఒకటైన కాన్పుర్‌లో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. 59 సీట్లకు పోలింగ్‌ జరగగా వీటిలో గత ఎన్నికల్లో 49 స్థానాలను బీజేపీయే కైవసం చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ పోటీలో ఉన్న కర్‌హాల్‌ నియోజకవర్గంలో 62 శాతం పోలింగ్‌ రికార్డైంది. యాదవ్‌లకు గట్టి పట్టున్న మెయిన్‌పురి జిల్లాలో ఉన్న ఈ సీటుపైనే అందరూ దృష్టి సారించారు. అఖిలేశ్‌కు ప్రత్యర్థిగా బీజేపీ కేంద్రమంత్రి ఎస్‌పీ సింగ్‌ బఘేల్‌ను పోటీలో నిలిపింది. 1992లో ఎస్పీ ఏర్పాటైన నాటి నుంచి కేవలం ఒకే ఒక్కసారి కర్హల్‌లో ఓడిపోయింది.