Vakeel Saab Release: టికెట్ ధరల పెంపుపై షాకిచ్చిన హైకోర్టు!

ఆకాశమే హద్దుగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కొనసాగుతుంది. పవన్ కమ్ బ్యాక్ సినిమాగా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే, అనుకొని విధంగా కోర్టు నిర్మాతలు, పంపిణీ దారులకు షాక్ ఇచ్చింది. వకీల్ సాబ్ టికెట్ ధరలను రెండు వారాల పాటు పెంచాలని జారీ చేసిన ఆదేశాలను ఏపీ హైకోర్టు తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Vakeel Saab Release: టికెట్ ధరల పెంపుపై షాకిచ్చిన హైకోర్టు!

Vakeel Saab Release

Vakeel Saab Release: ఆకాశమే హద్దుగా పవన్ కళ్యాణ్ క్రేజ్ కొనసాగుతుంది. పవన్ రాజకీయాలు, గత సాధారణ ఎన్నికలలో సినిమాలకు కాస్త విరామం ఇవ్వగా ఈలోగా కరోనా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ పవన్ కమ్ బ్యాక్ సినిమాగా వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఈ సినిమా రికార్డులు నెలకొల్పడం ఖాయంగా అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. మరోవైపు కరోనా లాక్ డౌన్ అనంతరం.. ఇప్పుడు మరో వేవ్ భయంతో ప్రేక్షకులు థియేటర్లకు అంతగా రావడం లేదని ప్రచారముంది. అయినా పవన్ క్రేజ్ తో భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి.

ఏప్రిల్ 9న వీకెండ్ టార్గెట్ చేసిన దర్శక, నిర్మాతలు శుక్రవారం విడుదలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే థియేటర్లో బుకింగ్‌లు తారాస్థాయికి చేరుకోగా థియేటర్ల వద్ద కోలాహలం మొదలైంది. అటు ఓవర్ సీస్ నుండి మన దేశంలో కూడా భారీ స్థాయిలో స్క్రీనింగ్ ప్లాన్ చేయగా టికెట్ ధరలను తొలి వారం పెంచిన ధరలతో రాబట్టుకోవాలని ప్లాన్ చేశారు. అయితే, అనుకొని విధంగా కోర్టు నిర్మాతలు, పంపిణీ దారులకు షాక్ ఇచ్చింది. వకీల్ సాబ్ టికెట్ ధరలను రెండు వారాల పాటు పెంచాలని జారీ చేసిన ఆదేశాలను ఏపీ హైకోర్టు తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

పాత ధరలతోనే టికెట్ల అమ్మకం జరపాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ల నుంచి ఎగ్జిబిటర్లకు నోటీసులు అందాయని తెలుస్తోంది. ఇప్పటికే అమ్ముడైన టికెట్లను కూడా క్యాన్సిల్ చేసి పాత ధరలతో కొత్తగా అమ్మకం చేపట్టాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిజానికి ఇది ఊహించని షాక్. నిజానికి కొంతకాలంగా పెద్ద సినిమాలకు ధరలను పెంచి అమ్మడం ఆనవాయితీగా వస్తుంది. అందుకు కోర్టులు కూడా ఒకే చెప్పేవి. కానీ ఇప్పుడు తొలిసారిగా ధరల పెంపు ఉత్తర్వులను కొట్టేస్తూ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

వకీల్ సాబ్ సినిమాకున్న క్రేజ్ కారణంగా ప్రత్యేక ప్రదర్శనల చెల్లింపు ప్రీమియర్ లను భారీగా ప్లాన్ చేసి టికెట్ ధరలను పెంచి అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు కోర్టు తీర్పుతో పంపిణీ వర్గాలు షాక్ తిన్నాయి. ఇప్పటికే టికెట్లు అమ్ముడుకోవడం.. తొలిరోజు ఆటకి టికెట్లు వెనక్కు రప్పించడం కాస్త కష్టమేనని తెలుస్తుండగా రెండవరోజు నుండి ఎలా చేయాలా అనే దానిపై ఇప్పటికే పంపిణీదారులలో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇదే వ్యవహారంపై ఎగ్జిబిటర్లు- పంపిణీదారులు నిర్మాతలతో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నట్లుగా తెలుస్తుంది.

Read: http://Vakeel Saab Release: ఏప్రిల్ నెలలో వస్తున్న పవన్ 7వ సినిమా.. ఇంకా ప్రత్యేకతలు ఇవే!