Varalaxmi Sarathkumar : వైరల్ అవుతున్న వరలక్ష్మి పోస్ట్

పాపులర్ హీరోయిన్ కమ్ విలన్ వరలక్ష్మీ శరత్ కుమార్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది..

Varalaxmi Sarathkumar : వైరల్ అవుతున్న వరలక్ష్మి పోస్ట్

Varalaxmi Sarathkumar

Updated On : September 15, 2021 / 5:04 PM IST

Varalaxmi Sarathkumar: సీనియర్ నటుడు శరత్ కుమార్ వారసురాలిగా తమిళనాట నటిగా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మీ శరత్ కుమార్. అతి తక్కువ టైంలోనే మంచి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. కేవలం గ్లామరస్‌గా కనిపించే కథానాయికగానే కాకుండా తనలోని విలనిజాన్ని కూడా ప్రేక్షకులకు చూపించింది. విజయ్ ‘సర్కార్’, విశాల్ ‘పందెంకోడి 2’ సినిమాలతో కోలీవుడ్‌లో వరూ పేరు మార్మోగిపోయింది.

Varalaxmi

ఇక తెలుగులో సందీప్ కిషన్ ‘తెనాలి రామకృష్ణ BA.BL’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఈ ఏడాది మాస్ మహారాజా రవితేజ ‘క్రాక్’ లో భయంకరమైన విలనిజాన్ని చూపించి జయమ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘నాంది’ సినిమాతో తెలుగు నాట వరలక్ష్మీ శరత్ కుమార్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ అయిపోయింది.

Krack

ఇదిలా ఉంటే రీసెంట్‌గా వరూ చేసిన ఇన్‌స్టా పోస్ట్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన మేకప్ మెన్ రమేష్ పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేసిందామె. అతనితో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ.. ‘నాకు సంబంధించిన అన్ని విషయాల్లో నువ్వే రమేష్ అన్నా.. నువ్వు లేకపోతే నేనేం చెయ్యలేను.. చెయ్యగలిగే దాన్ని కాదు.. నువ్వు కేవలం నా మేకప్ ఆర్టిస్ట్‌వి మాత్రమే కాదు.. నా కుడి భుజం.. ఈ నా ప్రయాణం ఇంతవరకు వచ్చిందంటే దానికి కారణం నువ్వే.. నేనిచ్చిన బర్త్‌డే గిఫ్ట్ నచ్చిందనే అనుకుంటున్నాను’ అంటూ భావోద్వేగభరితంగా రాసుకొచ్చారు వరలక్ష్మీ శరత్ కుమార్..

 

View this post on Instagram

 

A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar)