Varieties of Sugarcane : చౌడు భూములకు అనువైన చెరకు రకాలు

చౌడు భూములు అంటే భూ సారం తగ్గిపోయి, లవణాల శాతం అధికంగా వుండే భూములు. భూమిలో ఉప్పుశాతం ఎక్కువగా ప్రాంతాల్లో చెరకు మొక్కలు చనిపోయి పొలంలో అక్కడక్కడా ఖాళీలు ఏర్పడతాయి.

Varieties of Sugarcane : చౌడు భూములకు అనువైన చెరకు రకాలు

Sugarcane Varieties For Dry Lands

Updated On : June 26, 2023 / 11:53 AM IST

Varieties of Sugarcane : బోరు నీరు, ఉప్పునీరు అధికంగా పారించే ప్రాంతాల్లో రైతులు అధికంగా ఎదుర్కునే సమస్య చౌడు. ఏళ్ల తరబడి రసాయన ఎరువులను అధికంగా వాడే ప్రాంతాల్లో కూడా భూములు చౌడు బారిపోయాయి. ఇలాంటి భూముల్లో అధిక దిగుబడినిచ్చే సామర్ధ్యం వున్న చెరకు రకాలు  సాగుచేసినప్పటికీ చౌడును తట్టుకునే స్వభావం లేకపోవటం వల్ల రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు చౌడును సమర్థంగా తట్టుకుని, అధిక దిగుబడినిచ్చే చెరకు రకాలను రూపొందించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

READ ALSO : Sugarcane Cultivation : చెరకు సాగులో మెళకువలు

చౌడు భూములు అంటే భూ సారం తగ్గిపోయి, లవణాల శాతం అధికంగా వుండే భూములు. భూమిలో ఉప్పుశాతం ఎక్కువగా ప్రాంతాల్లో చెరకు మొక్కలు చనిపోయి పొలంలో అక్కడక్కడా ఖాళీలు ఏర్పడతాయి. పైరులో  పెరుగుదల సక్రమంగా వుండదు. రసాయన ఎరువులు వేసినా మొక్కల వేర్లు క్షీణించి వుండటంవల్ల పోషకాలను తీసుకోలేవు.

READ ALSO : Intercrop Cultivation : పామాయిల్ లో అంతర పంటగా చెరకు సాగు

విత్తనం సరైన మొతాదులో పెట్టినా మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఈ భూములను బాగుచేసుకునేందుకు రైతులు ఒక క్రమ పద్ధతిలో చౌడు నివారణ చర్యలు చేపట్టాలి. అంతే కాదు ఇప్పుడు  చౌడు భూములకు అనువైన చెరకు రకాలు 81వి48, కోటి 8201, కో7219, 81ఎ99, 93ఎ145, 99ఎ30, 83వి15, 97ఎ85 రైతులకు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎన్నుకొని సాగుచేస్తే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా, కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. వి. గౌరి.