Driving Licence: మరో రీమేక్‌పై వెంకీ చూపు.. లైసెన్స్ దక్కేనా?
రీమేక్ సినిమాలకు పెట్టింది పేరు విక్టరీ వెంకటేశ్. వెంకీ తన కెరీర్ లో ఇప్పటికే సుమారు 25కుపైగా రీమేక్ చిత్రాల్లో నటించగా.. ఈ మధ్యనే వచ్చిన దృశ్యం 2 ఓటీటీలో విడుదలై మరో,,

Driving Licence: రీమేక్ సినిమాలకు పెట్టింది పేరు విక్టరీ వెంకటేశ్. వెంకీ తన కెరీర్ లో ఇప్పటికే సుమారు 25కుపైగా రీమేక్ చిత్రాల్లో నటించగా.. ఈ మధ్యనే వచ్చిన దృశ్యం 2 ఓటీటీలో విడుదలై మరో భారీ సక్సెస్ కట్టబెట్టింది. కాగా, ఇప్పుడు మరో రీమేక్ చేయడానికి వెంకీ సిద్ధంగా ఉన్నాడని టాక్ మొదలైంది. ఇప్పటికే వెంకీ అండ్ సురేష్ ప్రొడక్షన్ రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట.
Ashu Reddy: అందానికే అసూయ పుట్టించే యాపిల్ బ్యూటీ అషు!
ఈ మధ్య కాలంలో సౌత్ లో మలయాళం సినిమాకోస్తున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్న సినిమాల నుండి పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల వరకు అందరూ మలయాళం సినిమాలపై ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇప్పటికే పవన్ అయ్యప్పనుమ్ కోషియంను భీమ్లా నాయక్ గా రీమేక్ చేస్తుంటే.. మెగాస్టార్ చిరంజీవి లూసిఫర్ ను గాడ్ ఫాదర్ గా రిమేక్ చేస్తున్నాడు. వెంకీ దృశ్యం రెండు పార్టులు పూర్తి కాగా ఇప్పుడు మరో రీమేక్ కోసం ప్రయత్నిస్తున్నాడు.
Indian 2: త్రిష కాదు తమ్మూ.. హీరోయిన్ కోసం ఇండియన్ వేట!
మలయాళంలో ‘డ్రైవింగ్ లైసెన్స్’ అనే సినిమా సూపర్ డూపర్ హిట్టయింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే ఈ సినిమా హక్కుల్ని దక్కించుకోగా.. వెంకటేష్, రవితేజలతో ఈ సినిమా తెరకెక్కించాలనుకున్నారు. ఇప్పుడు ఈ రైట్స్ చరణ్ నుంచి గీతా ఆర్ట్స్ చేతికి రాగా.. వెంకటేశ్‌తోపాటు మరో యంగ్ హీరోతో ఈ సినిమా ప్లాన్ చేయాలని చూస్తున్నారట. ఎఫ్ 3 తర్వాత ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.