Vidyut Jamwal : నేను చూసిన బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉంటా అంటున్న బాలీవుడ్ హీరో..

తాజాగా Khuda Hafiz 2 సినిమా ప్రమోషన్స్ కోసం విద్యుత్ జ‌మ్వాల్‌ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ గురించి పొగుడుతూ మాట్లాడాడు. ఈ ప్రమోషన్స్ లో విద్యుత్ జ‌మ్వాల్‌ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ..............

Vidyut Jamwal : నేను చూసిన బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌తో టచ్‌లో ఉంటా అంటున్న బాలీవుడ్ హీరో..

NTR : ఇటీవల మన సౌత్ సినిమాలు, సౌత్ యాక్టర్స్ బాలీవుడ్ లో ప్రభావం చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బాలీవుడ్ వాళ్ళు మన తెలుగులో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకోడానికి వచ్చేస్తున్నారు. ఇటీవల పలు బాలీవుడ్ సినిమాలు తెలుగులో రిలీజ్ అనౌన్స్ చేయడమే కాకుండా ఇక్కడ కూడా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ యాక్షన్ హీరోల్లో ఒకరైన విద్యుత్ జ‌మ్వాల్ త్వరలో Khuda Hafiz 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

Top Gun Maverick : అక్షరాలా వంద కోట్ల డాలర్లు.. నెల రోజుల్లో సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన టామ్ క్రూజ్..

తాజాగా Khuda Hafiz 2 సినిమా ప్రమోషన్స్ కోసం విద్యుత్ జ‌మ్వాల్‌ హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ గురించి పొగుడుతూ మాట్లాడాడు. ఈ ప్రమోషన్స్ లో విద్యుత్ జ‌మ్వాల్‌ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ”నేను ఇప్ప‌టివ‌ర‌కు చూసిన అత్యుత్త‌మ డ్యాన్స‌ర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎన్టీఆర్‌తో ట‌చ్‌లో కూడా ఉన్నాను, ఎన్టీఆర్ హార్డ్ వర్క్ అంటే చాలా ఇష్టం” అని తెలిపాడు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు.