Vijay Devarakonda: సెట్స్ మీదకి శివ నిర్వాణ సినిమా.. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్‌లో కథ!
ఆగలేదు.. ఆగే ప్రసక్తే లేదంటున్నాడు విజయ్ దేవరకొండ. జనగణమన పాడేశాక రౌడీబాయ్ నిర్వాణను పక్కన పెట్టేసాడనే ప్రచారం ఊపందుకుంది. కానీ అలాంటిదేమి లేదని.. శివతో వర్క్ చేయడం పక్కా అని..

Vijay Devarakonda
Vijay Devarakonda: ఆగలేదు.. ఆగే ప్రసక్తే లేదంటున్నాడు విజయ్ దేవరకొండ. జనగణమన పాడేశాక రౌడీబాయ్ నిర్వాణను పక్కన పెట్టేసాడనే ప్రచారం ఊపందుకుంది. కానీ అలాంటిదేమి లేదని.. శివతో వర్క్ చేయడం పక్కా అని తెలుస్తోంది. కొత్త కొత్త క్యారెక్టర్స్ చేస్తూ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయడమే టార్గెట్ గా ముందుకెళ్తున్న విజయ్.. శివ నిర్వాణ సినిమాతో కూడా సూపర్ కిక్ ఇవ్వబోతున్నాడు.
Vijay Devarakonda: ఫుల్ జోష్‌లో రౌడీ హీరో.. విజయ్ కాన్ఫిడెన్స్‌కి రీజనేంటి?
జనగణమన ప్రాజెక్ట్ తో ఫ్యాన్స్ ను ఎక్జైట్ చేశాడు విజయ్ దేవరకొండ. లైగర్ తర్వాత పూరీతోనే మరోసారి పాన్ ఇండియా సినిమాను పట్టాలెక్కించాడు. అయితే ఎప్పటినుంచో రౌడీబాయ్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న శివ నిర్వాణ సంగతేంటనే చర్చలు మళ్లీ మొదటికొచ్చాయి. అసలా ప్రాజెక్ట్ ఆగిపోయిందనే కామెంట్స్ ట్రెండ్ అయ్యాయి. కానీ అలాందేం లేదని.. అతిత్వరలో శివనిర్వాణ సినిమాను కూడా విజయ్ పట్టాలెక్కించబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.
Vijay Devarakonda: జనగణమన అంటూ యుద్ధంలోకి దూకిన దేవరకొండ
జనగణమనతో పాటే సైమల్ టేనియస్ గా శివ నిర్వాణ సినిమా ఉండబోతుంది. పూరీ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్న రౌడీబాయ్.. శివ నిర్వాణ కోసం సోల్జర్ గా మారబోతున్నాడు. ఇక అఫీషియల్ లాంచ్ త్వరగా చేసేసి నాలుగైదు నెలల్లోనే సినిమాను పూర్తి చేయాలని శివ నిర్మాణకు విజయ్ కండీషన్ పెట్టాడు. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ కథలో.. అక్కడే హీరోయిన్ సమంతాతో లవ్ ట్రాక్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రీమూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. పూరీ జనగణమన, శివనిర్వాణ ప్రాజెక్ట్ వచ్చేలోపు మాత్రం బాక్సింగ్ డైనమైట్ గా రౌడీబాయ్ లుక్ ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేయబోతుంది.