Vijay Devarakonda: రౌడీ స్టార్‌తో స్టార్ డైరెక్టర్ మూవీ.. లేనట్టేనా..?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో, ఈ హీరో తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. ఈ మూవీలో స్టార్ బ్యూటీ సమంత నటిస్తుండటంతో ఖుషి చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Vijay Devarakonda: రౌడీ స్టార్‌తో స్టార్ డైరెక్టర్ మూవీ.. లేనట్టేనా..?

Vijay Devarakonda Sukumar Movie Shelved

Updated On : December 24, 2022 / 9:58 PM IST

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘లైగర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో, ఈ హీరో తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నాడు ఈ హీరో. ఈ మూవీలో స్టార్ బ్యూటీ సమంత నటిస్తుండటంతో ఖుషి చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Vijay Devarakonda : నేను ఆ రెండింటితో సరసాలు ఆడుతుంటాను.. విజయ్ దేవరకొండ!

విజయ్ దేవరకొండ మరో స్టార్ డైరెక్టర్ సుకుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాను అఫీషియల్‌గా కూడా అనౌన్స్ చేసింది చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా 2023 చివరినాటికి పూర్తవుతుంది. ఆ తరువాత సుకుమార్‌తో సినిమా చేసేందుకు పులురు స్టార్ హీరోలు ఆయన్ను అప్రోచ్ అవుతున్నారట.

దీంతో విజయ్ దేవరకొండతో ఇప్పట్లో సుకుమార్ సినిమా చేయకపోవవచ్చని తెలుస్తోంది. మరి నిజంగానే సుకుమార్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో సినిమా అటకెక్కిందా అనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.