Virat Kohli: విరాట్ కోహ్లీ సెంచరీ లేకుండానే.. 642 రోజులు.. 50ఇన్నింగ్స్‌లు

ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీమిండియా బెస్ట్ ప్లేయర్ గా నిలిచిన విరాట్ కోహ్లీ.. ఓ చెత్త ఫీట్ సాధించాడు. 642 రోజుల్లో ఆడిన 50ఇన్నింగ్స్ ల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. చివ

Virat Kohli: విరాట్ కోహ్లీ సెంచరీ లేకుండానే.. 642 రోజులు.. 50ఇన్నింగ్స్‌లు

Virat Kohli Century

Virat Kohli: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీమిండియా బెస్ట్ ప్లేయర్ గా నిలిచిన విరాట్ కోహ్లీ.. ఓ చెత్త ఫీట్ సాధించాడు. 642 రోజుల్లో ఆడిన 50ఇన్నింగ్స్ ల్లో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు. చివరిసరాగి 2019లో బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు మ్యాచ్ లో మాత్రమే సాధించాడు.

ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో హెడింగ్లీ వేదికగా జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తాడనుకుంటే.. 11వ ఓవర్లో జోస్ బట్లర్ కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్ లు ఆడిన మొత్తం మీద 69పరుగులు మాత్రమే చేయగలిగాడు. లార్డ్స్ టెస్ట్ ఇన్నింగ్స్ లో బెస్ట్ స్కోర్ 42పరుగులే.

కాకపోతే ప్రస్తుత సిరీస్ లో కోహ్లీ ఒకే రీతిలో అవుట్ అవుతుండటం గమనార్హం. అవుట్ సైడ్ కు బాదడం క్యాచ్ లు ఇవ్వడం, లేదంటే వికెట్ కీపర్‌కు, స్లిప్ కార్డన్ కు క్యాచ్ లు ఇచ్చి వెనుతిరుగుతున్నాడు.

టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చెత్త షో ప్రదర్శించింది. లార్డ్స్‌లో అద్భుత విజయంతో సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్‌పై ఆధిక్యం సాధించిన భారత్‌.. అదే జోరు లీడ్స్‌లో కొనసాగించలేకపోయింది. మూడో టెస్టు మొదటి రోజే బ్యాటింగ్‌లో భారత్‌ కుప్పకూలింది. ఇంగ్లండ్‌ పేసర్ల విజృంభణతో టీమ్‌ఇండియా ప్లేయర్లు పెవీలియన్‌కు క్యూ కట్టక తప్పలేదు. ఇంగ్లీష్‌ టీమ్‌ దెబ్బకు కోహ్లీ సేన 78 పరుగులకే ఢమాల్‌ అయింది.

ఒకరిని మించి మరొకరు పెవిలియన్‌కు పోటీపడటంతో టెస్టుల్లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుని మూడో అత్యల్ప స్కోరును తన పేరిట రాసుకుంది టీమిండియా. కోహ్లీసేనను చిత్తుచిత్తుగా.. స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఇంగ్లండ్‌.. బ్యాటింగ్‌లోనూ ఇరగదీసింది. ఓపెనర్లు హమీద్‌, బర్న్స్‌ అజేయ అర్ధసెంచరీలతో తొలి రోజు ఆట ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 120 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌ ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.