Virata Parvam : ‘విరాట పర్వం’ వాయిదా.. త్వరలో కొత్త డేట్ అనౌన్స్ చేస్తామంటున్న మేకర్స్..

కరోనా మహమ్మారి రెండోసారి పంజా విసురుతోంది.. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా కోలుకుంటున్నాం.. మళ్లీ లాక్‌డౌన్ అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లే అంటూ ప్రజలు, వివిధ రంగాలకు చెందినవారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జనాలు థియేటర్లకు రావడం కష్టమేనంటూ కొత్త సినిమా విడుదల తేదీలు వాయిదా వేసుకుంటున్నారు మేకర్స్..

Virata Parvam : ‘విరాట పర్వం’ వాయిదా.. త్వరలో కొత్త డేట్ అనౌన్స్ చేస్తామంటున్న మేకర్స్..

Virata Parvam Release Postponed New Release Date Will Be Announced Soon

Updated On : April 14, 2021 / 5:37 PM IST

Virata Parvam: కరోనా మహమ్మారి రెండోసారి పంజా విసురుతోంది.. ఇప్పుడిప్పుడే కొద్దికొద్దిగా కోలుకుంటున్నాం.. మళ్లీ లాక్‌డౌన్ అంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లే అంటూ ప్రజలు, వివిధ రంగాలకు చెందినవారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జనాలు థియేటర్లకు రావడం కష్టమేనంటూ కొత్త సినిమా విడుదల తేదీలు వాయిదా వేసుకుంటున్నారు మేకర్స్.

Viraata parvam

నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ సినిమాతో స్టార్ట్ అయి పోస్ట్ పోన్‌ల పర్వం కంటిన్యూ అవుతోంది. తాజాగా మరో సినిమా వాయిదా పడింది. రానా దగ్గుబాటి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’ (రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్)..

Sai Pallavi

సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ముందుగా ఏప్రిల్ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.. కరోనా సెకండ్ వేవ్ రావడం, రోజురోజుకీ కేసులు పెరుగుతుండడంతో ఏప్రిల్ 30న ‘విరాట పర్వం’ మూవీని రిలీజ్ చెయ్యడంలేదని, త్వరలో కొత్త డేట్ అనౌన్స్ చేస్తామని, అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండాలంటూ చిత్ర బృంద అధికారికంగా ప్రకటించింది.