Arjun vs Vishwak : అర్జున్ వ్యాఖ్యలకి స్పందించిన విశ్వక్ సేన్ టీం?? అందుకే సినిమా నుంచి తప్పుకున్నాడు..

అర్జున్ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత విశ్వక్ సేన్ టీం సినీ సన్నిహితులతో దీనిపై మాట్లాడారని సమాచారం. అర్జున్ చెప్పినట్టు కథ విషయంలో విశ్వక్ జోక్యం చేసుకోవడం నిజమేనని......

Arjun vs Vishwak : అర్జున్ వ్యాఖ్యలకి స్పందించిన విశ్వక్ సేన్ టీం?? అందుకే సినిమా నుంచి తప్పుకున్నాడు..

Vishwak sen team comments on Arjun press meet

Arjun vs Vishwak :  సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో తన కూతురు హీరోయిన్ గా, విశ్వక్ సేన్ హీరోగా ఇటీవల ఓ సినిమాని లాంచ్ చేశారు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేశారు. పలువురు సినీ ప్రముఖులు ఈ సినిమా ఓపెనింగ్ కార్యక్రమానికి వచ్చారు. తన కూతురు టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుండటంతో గ్రాండ్ గానే ప్లాన్ చేసాడు అర్జున్ ఈ సినిమా.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు. ఇప్పటికే విశ్వక్ సేన్ వల్లే రెండు సార్లు వాయిదా పడిందని, అసలు సమాధానం ఇవ్వట్లేదని, ఎన్ని సార్లు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదని, కథలో వేలు పెడుతున్నాడని, ఇలాంటి కమిట్మెంట్ లేని హీరోని ఎక్కడా చూడలేదని అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మరీ విశ్వక్ పై ఫైర్ అయ్యాడు. ఓ రకంగా అర్జున్ ఈ విషయంలో చాలా బాధపడ్డాడు కూడా. దీనిపై విశ్వక్ సేన్ మాత్రం అధికారికంగా స్పందించలేదు.

అర్జున్ ప్రెస్ మీట్ జరిగిన తర్వాత విశ్వక్ సేన్ టీం సినీ సన్నిహితులతో దీనిపై మాట్లాడారని సమాచారం. అర్జున్ చెప్పినట్టు కథ విషయంలో విశ్వక్ జోక్యం చేసుకోవడం నిజమేనని, కథలో, డైలాగ్స్, మ్యూజిక్ విషయంలో కొన్ని కొన్ని మార్పులు విశ్వక్ సూచించాడు. కానీ అర్జున్ ఎలాంటి మార్పులకి ఒప్పుకోలేదు. అందుకే తనకి గౌరవం లేని చోట పని చేయడం అనవసరమని విశ్వక్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు అని చెప్పినట్లు తెలుస్తుంది.

Anu Emmanuel : అల్లు శిరీష్‌తో డేటింగ్.. ఆ వార్తలు చూసి మా అమ్మ చాలా బాధపడింది..

అయితే సోషల్ మీడియాలో ఈ విషయంలో విశ్వక్ సేన్ ని అందరూ ట్రోల్ చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ హీరో, ఎంతో అనుభవం ఉన్న హీరో పిలిచి సినిమా ఇస్తే చేయవా? కథ డైరెక్టర్ ఇష్టం, నచ్చకపోతే ముందే చెప్పొచ్చు కదా? కనీసం కలిసి క్లారిటీ ఇవ్వాలి కదా?, కథలో మార్పులు చెప్పే రేంజ్ స్టార్ హీరో అయిపోయావా అప్పుడే, ఎలాంటి వివాదం లేని హీరో అర్జున్ కి కనీస గౌరవం ఇవ్వలేదు విశ్వక్ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరి దీనిపై విశ్వక్ స్పందిస్తాడేమో చూడాలి.