VishwakSen : హిట్ పడగానే రేటు పెంచేసిన హీరో..

ఇప్పటిదాకా మాస్ సినిమాలు చేస్తూ మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ ఇటీవల క్లాస్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణంతో కూడా హిట్ కొట్టాడు. ఈ సినిమా విజయం సాధించడంతో విశ్వక్ తన రెమ్యునరేషన్ ని...........

VishwakSen : హిట్ పడగానే రేటు పెంచేసిన హీరో..

Vishwak

VishwakSen :  యువ హీరో విశ్వక్ మొదటి నుంచి కూడా డిఫరెంట్ సినిమాలు చేస్తూ విజయాలు సాధించాడు. ఇక ఎవడైతే నాకేంటి అనే తన యాటిట్యూడ్ తో టీనేజ్, యూత్ కి కనెక్ట్ అయ్యి అభిమానులని పెంచుకున్నాడు. ఇప్పటిదాకా మాస్ సినిమాలు చేస్తూ మాస్ కా దాస్ అనిపించుకున్న విశ్వక్ ఇటీవల క్లాస్ సినిమా అశోకవనంలో అర్జున కళ్యాణంతో కూడా హిట్ కొట్టాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో జరిగిన రచ్చ, దీనికి వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. దీంతో విశ్వక్ మరింత సక్సెస్ ని చూశాడు.

ఈ సినిమా విజయం సాధించడంతో విశ్వక్ తన రెమ్యునరేషన్ ని పెంచేసినట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు కోటి రూపాయల వరకు పారితోషికం తీసుకున్న ఈ యువ హీరో అశోక వనంలో అర్జున కళ్యాణం హిట్ అవ్వడంతో 2 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఓకే చేసిన సినిమాలు కాకుండా ఇకపై వచ్చే సినిమాలకి 2 కోట్లు పైన అయితేనే చేస్తాను అని చెప్తున్నాడు ఈ హీరో. మరి దీనికి నిర్మాతలు ఏమంటారో చూడాలి.

Vijay Devarakonda : ఖుషిలో విజయ్, సమంత లిప్‌లాక్??

అయితే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ఫాలో అవుతూ ఫేమ్ ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాలి అని ఫిక్స్ అయ్యాడు విశ్వక్ అని కొంతమంది అంటున్నారు. ఇక కొంతమంది ఏమో ఈ సినిమాకి ముందు ప్లాప్ ఉంది మర్చిపోయారా, ఒక్క సినిమాకే ఇలా అమాంతం రేటు పెంచేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ ఇటీవలే కోటి 50 లక్షలు పెట్టి కారు కూడా కొన్న సంగతి తెలిసిందే. మొత్తానికి విశ్వక్ ఒకపక్క వరుస సినిమాలు చేస్తూనే మరో పక్క డబ్బులు కూడా బాగా సంపాదించాలి అని ఫిక్స్ అయ్యాడు.