Gangs of Godavari : విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. సుట్టంలా సూసి..

తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ఫస్ట్ పాట సుట్టంలా సూసి సాంగ్ ప్రోమోని నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

Gangs of Godavari : విశ్వక్‌సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజ్.. సుట్టంలా సూసి..

Vishwaksen Neha Shetty Gangs of Godavari first song promo released

Updated On : August 15, 2023 / 11:17 AM IST

Gangs of Godavari :  విశ్వక్‌సేన్(Vishwaksen) ఇటీవల దాస్ కా ధ‌మ్కీ సినిమాతో హిట్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం మరో మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవల తన నెక్స్ట్ సినిమా కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచాడు. అంజలి(Anjali), నేహశెట్టి(Neha Shetty) ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గ్లింప్స్ లో.. మేము గోదారోళ్ళం.. మాటొకటే సాగదీస్తాం, తేడా వస్తే.. నవ్వుతూ నరాలు తీసేస్తాం అంటూ విశ్వక్‌సేన్ మాస్ డైలాగ్ తో అదరగొట్టాడు. పీరియాడిక్ పొలిటికల్ డ్రామాలా ఈ సినిమా ఉండబోతుంది.

తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నుంచి ఫస్ట్ పాట సుట్టంలా సూసి సాంగ్ ప్రోమోని నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. సుట్టంలా సూసి పోకలా.. సుట్టేసుకోవే చీరలా.. అని ఈ పాట సాగనుంది. విశ్వక్, నేహా శెట్టి మధ్య ఈ పాట ఉండనుంది. పల్లెటూళ్ళో జరిగే ఓ ప్రేమకథలా కనిపిస్తుంది. తాజాగా ప్రోమో రిలీజ్ చేయగా రేపు ఆగస్టు 16న పూర్తి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నారు.

RGV Vyooham Teaser : ఆర్జీవీ ‘వ్యూహం’ టీజర్ రిలీజ్.. కుట్రలకు, ఆలోచనలకు మధ్య..

ఇక ఈ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాని శ్రీకర ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి.