ఈ ఇంటి గేట్లకు తాళం వేసితిరి.. చుట్టూ గోడ కట్టడం మరిచితిరి! 

  • Published By: srihari ,Published On : May 19, 2020 / 05:09 AM IST
ఈ ఇంటి గేట్లకు తాళం వేసితిరి.. చుట్టూ గోడ కట్టడం మరిచితిరి! 

ఇంటర్నెట్లో ఓ ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఆ ఇంటి చుట్టూ ప్రహరీ గోడ లేదు. కానీ, ఇంటి ముందు ఒక గేటు ఉంది. ఆ గేటుకు తాళం వేసి ఉంది. సాధారణంగా ఒక ఇంటి చుట్టూ భద్రత కోసం ప్రహరీ గోడలను నిర్మించుకుంటారు. ఇంటి చుట్టూ అంతా ఖాళీ ప్రదేశమే కనిపిస్తోంది. మధ్యలో మాత్రం గేటును నిర్మించారు. దీనికి చుట్టూ గోడ సపోర్టు లేనేలేదు. ఆ గేటుకు తాళం కూడా వేసి ఉంచారు. లాక్ డౌన్ సమయంలో ఈ ఇంటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూస్తుంటే భారతీయ గ్రామానికి చెందిన ఇల్లు మాదిరిగా కనిపిస్తోంది. 

ఈ ఇంటికి భద్రత కోసం ముందు గేటుకు తాళం వేసినట్టుగా ఉంది. కానీ, ఇంట్లోకి చొరబడేందుకు వీలుగా అంతా ఖాళీ స్థలమే కనిపిస్తోంది. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించినట్టుగా కనిపించడం లేదు. ఈ ఫొటో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. ట్విట్టర్ యూజర్లు సరదాగా మెమీలతో జోకులు పేలుస్తున్నారు. ఒక ట్విట్టర్ యూజర్ భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు అని అంటే.. మరో నెటిజన్.. ఆధార్ కార్డు ఎంత భద్రత ఉందో దీనిబట్టి తెలుస్తుందని ట్వీట్ చేశారు.

మరో యూజర్? పాకిస్థాన్ ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రయత్నిస్తోందని అంటుంటే.. మరో యూజర్.. AAPలో అవినీతిని అరవింద్ కేజ్రీవాల్ కంట్రోల్ చేస్తున్నారంటూ పోస్టు చేశారు. ప్రజలను మూవీలను చూడకుండా నిషేధం విధించినట్టుగా కనిపిస్తోందని ఒకరు.. దక్షిణాఫ్రికాలో భారత క్రికెట్ జట్టు గోడ అదృశ్యమైందంటూ సరదాగా ట్వీట్ చేశారు.  

Read:  10 రూపాయల నోటుని మాస్క్ లా వాడిన యువకుడు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు