Gujarat Polls: గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పాత్రేంటి? కాంగ్రెస్ ఓటమితో బీజేపీ-బీ టీం అంటారా?

ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో చేసింది. సాంకేతికంగా చూసుకుంటే విపక్షాల ఓట్లు చీలడం అధికార పార్టీకి లాభాన్ని చేకూర్చడం అనేది జరిగేదే. కానీ, ఒకరి పోటీని ఈ విధంగా తప్పు పడుతూ ఆరోపణలు చేయడం ఆరోగ్యకరం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఇలాంటి ఆరోపణలు చేయకపోలేదు. ఆ పార్టీకి ఎవరూ అడ్డు రాకపోయినప్పటికీ బీజేపీ గెలుపుపై స్పందించిన పలు సందర్భాల్లో కొన్ని పార్టీలను బీ టీం అంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు

Gujarat Polls: గుజరాత్ ఎన్నికల్లో ఆప్ పాత్రేంటి? కాంగ్రెస్ ఓటమితో బీజేపీ-బీ టీం అంటారా?

What is AAP's role in Gujarat elections? With the defeat of the Congress, will the BJP-B team be called?

Gujarat Polls: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కనివినీ ఎరుగని రీతిలో అఖండ మెజారిటీ సాధించింది. ఇదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంత పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ రెండు వింతలకు కారణం ఆమ్ ఆద్మీ పార్టీనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే, ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఆప్ చాలా వరకు చీల్చింది. ఆప్ 13 శాతం వరకు ఓట్లు సంపాదించింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 44 శాతం నుంచి 27 శాతానికి ఓట్ బ్యాంకును కోల్పోయింది.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో ఆప్ పాత్రపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. ఆప్ పోటీకి దిగడం వల్లే బీజేపీ లాభపడి కాంగ్రెస్ నష్టపోయిందా? అనేది ప్రధానంగా చర్చలోకి వస్తోంది. ప్రజాస్వామ్యంగా చూసుకుంటే ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయవచ్చు. కానీ కొంత కాలంగా బీజేపీ విజయాలపై విపక్షాలు కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. అంతగా బలం లేని పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలిస్తూ బీజేపీకి లాభాన్ని చేకూరుస్తున్నాయని వారి వాదన. ఇలా ఎంఐఎం, బీఎస్‭పీలపై చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి.

Gujarat Polls: తన రికార్డును తానే బద్దలు కొడుతూ కాంగ్రెస్ రికార్డును కూడా బద్దలు కొట్టిన బీజేపీ

ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఆరోపణలు చాలా సందర్భాల్లో చేసింది. సాంకేతికంగా చూసుకుంటే విపక్షాల ఓట్లు చీలడం అధికార పార్టీకి లాభాన్ని చేకూర్చడం అనేది జరిగేదే. కానీ, ఒకరి పోటీని ఈ విధంగా తప్పు పడుతూ ఆరోపణలు చేయడం ఆరోగ్యకరం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఇలాంటి ఆరోపణలు చేయకపోలేదు. ఆ పార్టీకి ఎవరూ అడ్డు రాకపోయినప్పటికీ బీజేపీ గెలుపుపై స్పందించిన పలు సందర్భాల్లో కొన్ని పార్టీలను బీ టీం అంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే పార్టీ గుజరాత్ ఎన్నికల్లో చేసిందేంటి?

సగానికి పైగా ఓట్ బ్యాంక్ సాధించినప్పటికీ క్లీన్ స్వీప్ స్థానాలు సాధించడం సాధ్యం కాదు. గతంలో కూడా బీజేపీకి 50 శాతం ఓట్ బ్యాంక్ సాధించింది. అయితే సీట్లు మాత్రం 99 మాత్రమే వచ్చాయి. కానీ తాజా ఎన్నికల్లో బీజేపీ సాధించింది. కారణంగా కాంగ్రెస్, ఆప్ మధ్య ఓట్లు భారీగా చీలాయి. ఎంతలా అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 44 శాతం ఓటు బ్యాంకు ఈసారి 27 శాతానికి తగ్గింది. అందులో నుంచి ఆప్ 13 శాతం తీసుకుంది. ఒకవేళ ఆప్‭కే కనుక ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు రాకపోతే కాంగ్రెస్ మరిన్ని స్థానాలు గెలిచేది అంటున్నారు. ఎందుకంటే చాలా నియోజకవర్గాల్లో అత్తెసరు మెజారిటీతోనే బీజేపీ అభ్యర్థులు గెలిచారు.

AAP National Party: జాతీయ పార్టీగా ఆప్!.. కలిసొచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు

అలా అని ఆప్ సాధించిన సీట్లు కూడా అంత ఎక్కువేమీ లేవు. అన్ని ఓట్లు సాధించినప్పటికీ సీట్లు మాత్రం ఐదే వచ్చాయి. కాంగ్రెస్ పరిస్థితి ఇదే అయింది. 27 శాతం ఓట్లు వచ్చినప్పటికీ 17 సీట్లకే పరిమితమైంది. ఇరు పార్టీల ఓట్ బ్యాంకు లెక్కిస్తే 40 శాతానికి పైనే ఉంటుంది. ఒకవేళ ఈ ఓట్ బ్యాంకు ఒకే పార్టీకి వస్తే ఫలితాలు మరోలా ఉండేవని అంటున్నారు. అంతే కాకుండా చాలా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు స్వల్ప మెజారిటీతో ఒడ్డున పడ్డారు. ఆ స్థానాల్లో ఈ రెండు పార్టీల్లో ఒకరు మాత్రమే ఉండుంటే బీజేపీ ప్రభంజనాన్ని తగ్గించే వారనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి చాలా ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై విపక్ష పార్టీలను నిందించిన ఈ రెండు పార్టీలు.. మరి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుపై వీరిలో ఎవరిని బీ టీం అంటారో చూడాలి.