Love Breakup : మీరు లవ్‌లో ఫెయిల్ అయ్యారా.. బ్రేకప్ బాధ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోండీ..

మీరు లవ్‌లో ఫేయిల్ అయ్యారా.. బ్రేకప్ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోండీ..

Love Breakup : మీరు లవ్‌లో ఫెయిల్ అయ్యారా.. బ్రేకప్ బాధ నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోండీ..

What Is The Best Piece Breakup Advice

What Is The Best Piece Breakup Advice : ప్రేమ. అదొక అనిర్వచనీయమైన బంధం. ప్రేమ అంటే ఇలా ఉంటుంది..ఇలా ఉండాలి అని చెప్పలేనిది. ఆస్వాదించి తెలుసుకోవాల్సిన మధురమైన అనుభూతి. అటువంటి ప్రేమలో పడినవారు ఒకరికి ఒకరు సర్వస్వం అనుకుంటారు. గంటల తరబడి మాట్లాడుకున్నా ఇంకా ఏవేవో ఊసులు చెప్పుకోవాలని తపిస్తుంటారు. ఒకరిపై మరొకరు ప్రాణాలే పెట్టుకుంటారు. అటువంటి ప్రేమికులు ఏవేవో కారణాలతో విడిపోతే..ఆ బాధనుంచి కోలుకోవటం చాలా చాలా కష్టం. వారి విడిపోవటానికి అవి అభిప్రాయబేధాలు కావచ్చు మరొకటి కావచ్చు. తీరా విడిపోయాక ఆ బాధ నుంచి కోలుకోవటం చాలా కష్టమనే చెప్పాలి. కొంతమంది డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంటారు. మరికొందరు మత్తుకు బానిసవుతుంటారు.

ఇద్దరి మధ్య ఎడబాటు.. ఎందిరినో ఒంటరి చేస్తుంది. ఇక తాము రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో బ్రేకప్ తర్వాత అంతకంటే ఎక్కువ వేదనకు గురి అవుతుంటారు. గుండె బద్దలు అయిపోయినట్లుగా కృంగిపోతుంటారు. బ్రేకప్.. మూడే అక్షరాలు కానీ ఆ బాధను అనుభవించటం చాలా చాలా కష్టం. కొందరు ఈజీగా విడిపోయి కొంత కాలం బాధపడి టేకిట్ ఈజీ అన్నట్లుగా వారి దైనందిన జీవితంలో పడిపోతుంటారు.మరికొందరు కానీ కొంత మంది విడిపోయిన తర్వాత తమ జీవితమే ముగిసిపోయిందనుకుంటారు. కానీ రిలేషన్ షిప్ నుంచి విడిపోయినాక తర్వాత ఆ భావన నుంచి కోలుకుని మాములు స్థితికి వచ్చిన ఆరుగురు వ్యక్తులను గురించి తెలుసుకుందాం.

1. బ్రేకప్ నన్ను చాలా బాధ పెట్టింది. దాని నుంచి బయటపడటానికి నేను ఎంతో ట్రై చేశాను. కానీ నా వల్ల కాలేదు. నేను నా ఎక్స్ కంటే నేను ఎక్కువ బాధను అనుభవించాననే వాస్తవాన్ని తెలుసుకుని నన్ను నేను అసహ్యించుకున్నాను. దీన్నుంచి ఎలాగైనా బయటపడాలనుకున్నాను. కానీ అది అనుకున్నంత సులువుకాదని కూడా తెలుసుకున్నాను. కానీ జీవితం చాలా గొప్పది. ఎప్పుడూ బాధపడే వ్యక్తిగా ఉంటం సరైంది కాదు అనే వాస్తవాన్ని తెలుసుకున్నాను. ఈ విషయం చాలామంది నాకు చెప్పేవరకు నాకు తెలియలేదు. ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని గ్రహించి తెలిసి సిగ్గుపడ్డాను. ఇది నేను ముందుకు సాగడానికి చాలా సహాయపడింది.

2. మా బ్రదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇద్దరం ఎప్పుడు కలిసి జిమ్‌కి వెళ్లే వాళ్లం . కానీ కొన్ని రోజు తర్వాత నేను జిమ్‌కి వెళ్లడం మానేసా. దాంతో ఎందుకు జిమ్ కు రావటంలేదని అడిగాడు. కానీ నేను చెప్పలేదు. కానీ నా బ్రేకప్ గురించి మా అన్నయ్యకు తెలిసింది. దీంతో ఎంతో ప్రేమగా నాకు దాదాపు కౌన్సిలింగ్ చేసినట్లుగా ఎన్నో విషయాలు చెప్పాడు. జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదని ఎన్నో ఉంటాయని తెలియజేశాడు. అలా ఎన్నో విధాలుగా అన్నయ్య నాకు బ్రేకప్ అనే ఫీలింగ్ నుంచి బయటపడేలా చేశాడు. నువ్వు ఎక్కువగా ఆలోచించడం ద్వారా నీ టైమ్ వేస్టు అవుతుంది. నిన్ను నువ్వు కోల్పోతున్నావని నన్ను నాకు తిరిగి పరిచయం చేశాడు. బ్రేకప్ బాధనుంచి బయటపడటానికి చక్కటి సినిమాలు చూడని..ఇష్టమైన పనులు చేయమని చెప్పాడు. అలా అన్నయ్య నాకు తిరిగి నా జీవితం విలువ ఏంటో తెలియజేశాడు. అలా అన్నయ్య వల్ల నేను బ్రేకప్ ఫీలింగ్ నుంచి బయటపడ్డాను. నన్ను నేను తెలుసుకున్నాను తిరిగి నా జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను..ఆస్వాదిస్తున్నాను.

3. బ్రేకప్ అయిపోయిన తర్వాత మీరు మీ గురించి ఎక్కువగా తెలుసుకోవాలి. మిమ్ముల్ని మీరు ఉన్నతంగా ఊహించుకోవాలి. మీకు మీరే తోడు ఎవరు రారు మీకు తోడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి.. ఇదే నేను విడిపోయినప్పుడు నా ఎక్స్ నుంచి విడిపోయాక నేను ఎన్నో వాస్తవాలు తెలుసుకున్నాను..జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయని గుర్తించాను. ఇప్పుడు నేను నా జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను..

4. కొంత మంది ఏడిస్తే ఇతనేంటి ఎడుస్తున్నాడని వెకిలిగా చూస్తుంటారు. కానీ ఏడవడం ఒక వరంలాంటిది అని నేను నమ్ముతాను. నాకు బలం ఎవరైనా ఉన్నారా అంటే అది మా అమ్మే. ఆమే నాకు ఏడిస్తే కలిగే ప్రయోజనాల గురించి చెప్పింది. ఏడిస్తే ఎదలోని బాధ తగ్గిపోతుంది. మనస్సు తేలికపడుతుంది. ఏడ్చే ధైర్యం ఉన్నవాళ్లు దేన్నైనా ఎదుర్కొంటానే సత్యాన్ని మా అమ్మ నాకు చెప్పింది. అందుకే నాకు బ్రేకప్ అయిపోయినప్పుడు నేను చాలా ఏడ్చాను. ఇప్పుడు నేను నా కన్నీళ్లను వేస్టు చేయటంలేదు. ఎందుకంటే వాటి విలువ నాకు బాగా తెలిసింది.

5. నాకు బ్రేకప్ అయ్యాక ఏపనిమీద మనస్సు ఉండేది కాదు. ఏదో కోల్పోయిన భావనతో కొట్టుమిట్టాడటం అలవాటుగా మారిపోయింది. కానీ బ్రేకప్ నుంచి బటయపడటానికి ఓ ఆపన్న హస్తం నన్ను ఆదుకుంది. ఆ చేయి నా ఫ్రెండ్ ది. బ్రేకప్ బాధనుంచి బయటపడటానికి పనిలో పడాలని అనుకోకు. ముందు ఆ భాధనుంచి బయటకు రా..టైమ్ తీసుకో..కానీ బాధనుంచి బయటకు రా..అదే జీవితం కాదు..బాధకు బయట చాలా జీవితం ఉందని తెలియజేసింది. ఎటువంటి పనీ చేయకు..బాధను జయించు అనే నీకు ప్రస్తుతం ఉన్న పెద్ద పని అని చెప్పింది. నిజమే కదానిపించింది. తన సలహా ద్వారా ఈరోజు నేను మళ్లీ మాములు స్థాయికి వచ్చాను.

6.బ్రేకప్ అయిన తర్వాత నేను రోజూ ఏడుస్తూ ఉండేదాన్ని. కానీ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ కొండంత అండగా నిలబడింది. ఎక్స్ నుంచి ఎలా ఎక్సిట్ అవ్వాలో చెప్పింది. దాని కోసం ఫస్ట్ చేయాల్సిన పని నీ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి నీ మాజీని బ్లాక్ చెయ్యి అని చెప్పింది. తను చెప్పినట్లే చేశాను. చాలా బాధతో. కానీ అలా చేయటం మంచిది అని తెలుసుకున్నాను. దానికి నేను తనకు ఎంతగా థాంక్స్ చెప్పినా తక్కువే. ఎందుకంటే తాను ఇచ్చిన ఆ సలహా వలన నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను. లేకపోతే నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనకోసం ఏడుస్తూ ఉండేవాడినేమో.

బ్రేకప్ అనే మూడు అక్షరాలు ఎంతో మంది జీవితాలను ఛిన్నా భిన్నం చేస్తున్నాయి. ఆ మూడు అక్షరాల నుంచి బయటపడితే జీవితం చాలా ఉందని గ్రహించటం కూడా చాలా గొప్ప విషయమనే చెప్పాలి. ఈ విషయంలో ‘కాలం’ అనేది పెద్ద డాక్టర్ అని నా అభిప్రాయం. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ (రోజులు వారాలు నెలలు ఇలా)గడిచే కొద్దీ మనస్సులో బాధ తగ్గుతుంది. కానీ ఇక్కడ అసలు విషయం ఏమిటంటే ఆ కాలానికి మనం ఓ అవకాశం ఇవ్వాలి. త్వరపడి ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉంటే..కాలం గడిచేకొద్దీ మనస్సులో బాధ తగ్గుతుంది. కొత్తలో ఉన్నంత బాధ ఆ తరువాత ఉండదు. ఆ తరువాత పూర్తిగా మర్చిపోకపోయినా..మనస్సు భారం తగ్గి మనస్సు తేలికపడుతుంది. మన జీవితం విలువ మనకు తెలిసి వస్తుంది. కాలం ఎంత గొప్ప డాక్టర్ అంటే మనకు ఎంతో ఆత్మీయుల్ని కోల్పోయినా ఆ బాధనుంచి కోలుకునేలా చేస్తుంది. అదే కాలప్రభావం. రోజులు గడిచే కొద్దీ ఏ బాధ అయినా తగ్గితీరుతుంది. ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది.