WhatsApp Self-destructing Feature : స్నాప్‌చాట్‌కు పోటీగా వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్..

స్నాప్ చాట్ కు పోటీగా ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. సెల్ఫ్ డిస్ట్రెక్టింగ్ ఫొటోస్ అండ్ వీడియో ఫీచర్.

WhatsApp Self-destructing Feature : స్నాప్‌చాట్‌కు పోటీగా వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్..

Whatsapp Self Destructing Feature

WhatsApp Self-destructing Feature : స్నాప్ చాట్ కు పోటీగా ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. అదే.. సెల్ఫ్ డిస్ట్రెక్టింగ్ ఫొటోస్ అండ్ వీడియో ఫీచర్. ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ బీటా వాట్సాప్ ఆండ్రాయిడ్ వెర్షన్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ సెల్ఫ్ డిస్ట్రెక్టింగ్ ఫీచర్ పై వాట్సాప్ టెస్టింగ్ చేస్తోందని WABetaInfo అధికారికంగా ట్వీట్ చేసింది. ఫ్యూచర్ అప్ డేట్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. వాట్సాప్ లో మరింత ప్రైవసీ కోరుకునే యూజర్ల కోసం స్ర్కీన్ షాట్ డిటెక్షన్ ఫీచర్ కూడా ప్రవేశపెడుతోంది.

మీ సెల్ఫ్ డిస్ట్రెక్టింగ్ ఫోటోలు, వీడియోలను ఎవరైనా స్నాప్ షాట్‌లో స్ర్కీన్ షాట్లను తీసేందుకు ప్రయత్నిస్తే.. మీకో నోటిఫికేషన్ వస్తుంది. మీ ప్రైవేటు కంటెంట్ ను ఎవరూ సేవ్ చేస్తున్నారో అలర్ట్ చేస్తుంది ఈ కొత్త ఫీచర్. యూజర్లకు ప్రైవసీ అలర్ట్ పంపే ఫీచర్ ను టెస్టింగ్ చేస్తోందని WABetaInfo వెల్లడించింది. మీరు పంపిన ఫొటోలు, వీడియోలను ఇతరలు ఒకసారి మాత్రమే ఓపెన్ చేయగలరు. రెండోసారి ఓపెన్ చేయలేరు. ఈ స్క్రీన్ షాట్ డిటెక్షన్ ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లకు అధికారికంగా అందుబాటులోకి వస్తుందా? లేదా క్లారిటీ ఇవ్వలేదు. వాట్సాప్ బీటా వెర్షన్ 2.21.9.3 డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా ఈ కొత్త ఫీచర్ యాక్సస్ చేసుకోవచ్చు.

వాట్సాప్ బీటా వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోండిలా :
మీ ఆండ్రాయిడ్ ఫోన్లో వాట్సాప్ బీటా వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవాలంటే.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లండి. అందులో వాట్సాప్ కోసం సెర్చ్ చేయండి.
ప్లే స్టోర్ పేజీని కిందికి స్ర్కోల్ చేయండి.. Become A Beta Tester కోసం సెర్చ్ చేయండి.
I’m In” బటన్ పై క్లిక్ చేయండి. Join బటన్ పై క్లిక్ చేసి Confirm చేసుకోండి.
మీకు బీటా వెర్షన్ యాప్ అప్ డేట్ అయిపోతుంది.
ఐఫోన్ వాట్సాప్ యూజర్లు వాట్సాప్ బీటా వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవడం కష్టమే..
మీ కంప్యూటర్ లో కూడా గూగుల్ ప్లే సైట్ ద్వారా వాట్సాప్ బీటా వెర్షన్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

మరోవైపు ఇన్ స్టాగ్రామ్ కూడా కొత్త టూల్ తీసుకొస్తోంది. తమ ప్లాట్ ఫాంపై అభ్యంతర మెసేజ్ లను ఫిల్టర్ చేసేస్తుంది. ఫేస్ బుక్ కూడా తమ న్యూస్ ఫీడ్ పై కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. పోడ్ క్యాస్ట్స్, ఆడియో క్లిప్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ కూడా తమ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. టెక్స్టింగ్, వాకింగ్ సమయంలో avoid collisions కాకుండా ఉండేలా చూసుకోవచ్చు.