WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!

ప్రముఖ ఇన్ స్టింట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీ దృష్ట్యా ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ అప్ డేట్ తీసుకొచ్చింది.

WhatsApp Privacy Update : వాట్సాప్‌లో న్యూ అప్‌డేట్.. ఈ కొత్త ప్రైవసీతో వారికి చెక్ పెట్టొచ్చు..!

Whatsapp Updates Privacy Disallowing Third Party Apps, Non Contacts. See The Impact

WhatsApp New Privacy Update : ప్రముఖ ఇన్ స్టింట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. వాట్సాప్ యూజర్ల ప్రైవసీ దృష్ట్యా ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ అప్ డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ యూజర్ల డేటా భద్రత విషయంలో మెసేజింగ్ యాప్ ఎప్పటికప్పుడూ కొత్త సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పుడు వాట్సాప్.. కొత్త ప్రైవసీ అప్ డేట్ రిలీజ్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్ల ప్రైవసీకి మరింత భద్రత అందించనుంది. వాట్సాప్ యూజర్ ఎవరైనా తమ ప్రైవసీని ఎవరికి కనిపించకుండా ఉండేందుకు వీలుగా Last Seen Time, Online అనే రెండు ఆప్షన్లు హైడ్ చేసుకోవచ్చు.

తద్వారా ఇతర వాట్సాప్ యూజర్లు మీరు ఆన్‌లైన్‌లో ఉన్నారని తెలుసుకోవడం కష్టమే. ఈ కొత్త ప్రైవసీ అప్‌డేట్ ఫీచర్ ఆండ్రాయిడ్ (Android)​, ఐఓఎస్​ (iOS) రెండు డివైజ్‌ల్లోనూ ఒకేసారి అప్ డేట్ చేసింది వాట్సాప్. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్​ యూజర్ల అందరికి ఈ కొత్త ప్రైవసీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు వాట్సాప్ కు పోటీగా టెలిగ్రామ్ కూడా తమ యూజర్ల కోసం కొత్త ప్రైవసీ ఫీచర్లను ప్రవేశపెట్టింది. టెలిగ్రామ్ కు పోటీగా వాట్సాప్ ఈ సరికొత్త ప్రైవసీ అప్ డేట్ తీసుకొచ్చింది. ఈ కొత్త ప్రైవసీ అప్ డేట్ (New Privacy Update) కోసం మీ వాట్సాప్ అప్ డేట్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆటో అప్ డేట్ అయి ఉండొచ్చు ఓసారి చెక్ చేసుకోండి…

ఇప్పటివరకూ వాట్సాప్ యూజర్లు ప్రైవసీ కోసం యూజర్లు.. గూగుల్ ప్లే స్టోర్ (Play Store), ఆపిల్ (App Store)లో ఇతర థర్డ్ పార్టీ యాప్స్ పై ఆధారపడాల్సి వచ్చింది. అయితే ఈ యాప్స్ ద్వారా యూజర్ల ప్రైవసీకి మరింత ముప్పు ఏర్పడింది. ఎందుకంటే.. ఈ యాప్స్ ద్వారా వాట్సాప్ యూజర్ల Last Seen Time, Online Status ఈజీగా ట్రాకింగ్ చేయొచ్చు. వాట్సాప్ యూజర్లను స్టేటస్ తెలుసుకునేందుకు చాలామంది ఈ యాప్స్ వినియోగిస్తున్నారు. ఇకపై ఇలాంటి పరిస్థితి లేకుండా యూజర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం వాటిల్లకుండా ఉండేందుకు వాట్సాప్ ఈ కొత్త ప్రైవసీ అప్ డేట్ తీసుకొచ్చినట్టు వాట్సాప్ ట్రాకర్ WABetaInfo వెల్లడించింది.

మీ వాట్సాప్‌లో ఎప్పుడూ చాటింగ్ చేయని వారు లేదా మీ కాంటాక్ట్​ లిస్ట్​లో లేని వారికి మీ స్టేటస్ చూడలేరిక.. మీ వాట్సాప్ Last Seen Time, Online Status ఎప్పటికీ ట్రాక్ చేయలేరు. ఆఖరికి థర్డ్ పార్టీ యాప్స్ (Third-Party) Apps ద్వారా కూడా ట్రాక్ చేయలేకుండా ఈ ఫీచర్ ప్రొటెక్ట్ చేస్తుందని అంటున్నారు. అందుకే ఈ సరికొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టినట్టు వాట్సాప్ ట్రాకర్ WABetaInfo పేర్కొంది.

Read Also : WhatsApp New Scam : ఆ మెసేజ్ వచ్చిందా? అయితే బీ కేర్ ఫుల్.. వాట్సాప్ యూజర్లకు వార్నింగ్