WhatsApp Stop : న‌వంబ‌ర్ 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ ప‌నిచేయ‌దు.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి!

వాట్పాప్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వాట్సాప్ పనిచేయదు.. అన్ని ఫోన్లలో కాదు.. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే. ఆ ఫోన్ల లిస్టులో మీ ఫోన్ కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి..

WhatsApp Stop : న‌వంబ‌ర్ 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ ప‌నిచేయ‌దు.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి!

Whatsapp Won’t Work On These Android Phones From November 1

WhatsApp Services Stop : వాట్పాప్ యూజర్లకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వాట్సాప్ పనిచేయదు.. అన్ని ఫోన్లలో కాదు.. కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు, ఐఫోన్లలో మాత్రమే. ఆ ఫోన్ల లిస్టులో మీ ఫోన్ కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి.. కొన్ని ఆండ్రాయిడ్ వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిపివేయనుంది. ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లలోనే కాదు.. ఐఫోన్లలో కూడా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. నవంబర్ 1 నుంచి ఆయా ఫోన్లలో వాట్పాప్ అప్ డేట్స్ రావు. ఫీచర్లు అప్ డేట్స్ కావు. పాత వెర్షన్ మాత్రమే పనిచేస్తుంది. అప్ గ్రేడ్ కూడా చేసుకోవడం వీలు ఉండదు. ఫోన్లో వాట్సాప్ పనిచేస్తుంది తప్పా వాట్సాప్ అందించే సెక్యూరిటీ అప్ డేట్స్ ఏమి రావు. కొన్నిరోజులు పూర్తిగా వాట్సాప్ పనిచేయడం ఆగిపోతుంది. ఏయే ఆండ్రాయిడ్, ఐఫోన్లలో వాట్సాప్ సర్వీసులు నిలిచిపోనున్నాయో తెలిస్తే.. మీ ఫోన్ ఆ జాబితాలో ఉందో లేదో తెలుసుకోవచ్చు. వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయే ఫోన్లను ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ముందుగా మీ ఫోన్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.. సెట్టింగ్స్ ఆప్ష‌న్‌లోకి వెళ్లండి. అక్కడ మీకు About phone అనే ఆప్ష‌న్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. ఆ తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేయండి. మీ ఫోన్‌లో ర‌న్ అయ్యే ఆండ్రాయిడ్ వ‌ర్ష‌న్‌ కనిపిస్తుంది. మీ ఫోన్ రన్ అయ్యే ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.4 లేదా అంత‌కంటే త‌క్కువ వ‌ర్ష‌న్ అయితే.. మాత్రం నవంబ‌ర్ 1 నుంచి మీ ఫోన్‌లో వాట్స‌ప్ సర్వీసులు నిలిచిపోతాయి. ఆండ్రాయిడ్ వెర్షన్ 4.0.4 కన్నా హై వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లను కొనుక్కోవాల్సిందే. అదే ఐఫోన్ యూజ‌ర్లు iOS 10 లేదా అంత‌కంటే త‌క్కువ వ‌ర్ష‌న్ ఉన్న ఫోన్‌లో వాట్స‌ప్ సర్వీసులు పనిచేయవు. ఐఫోన్ 5 వెర్షన్ త‌ర్వాత వ‌చ్చిన మోడ‌ల్స్‌లో మాత్ర‌మే వాట్స‌ప్ సర్వీసులు పనిచేయనున్నాయి. ఇతర స్మార్ట్ ఫోన్లతో పాటు జియో ఫోన్‌, జియో ఫోన్ 2 ఫీచ‌ర్ ఫోన్ల‌లో కూడా KaiOS 2.5.0 వెర్షన్ లేదా అంత‌కంటే హైవెర్షన్‌లో మాత్రమే వాట్స‌ప్ రన్ అవుతుంది.
Whatsapp Web : వాట్సాప్ వెబ్‌లోనూ కొత్త ప్రైవసీ ఆప్షన్..!

ఒకవేళ మీ ఆండ్రాయిడ్ 4.0.4 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఉంటే మాత్రం వెంటనే కొత్త వెర్షన్ అప్ గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నవంబర్ 1వ తేదీలోగా మీ ఫోన్లలోని వాట్సాప్ కన్వర్షన్ హిస్టరీ డేటాను ఎక్స్ పోర్ట్ చేసుకోవాలి. వ్యక్తిగత లేదా గ్రూపు చాట్స్ కూడా బ్యాకప్ తీసుకోండి. బ్యాకప్ కోసం మీరు చేయాల్సిందిల్లా..

Whatsapp సెట్టింగ్స్ లోకి వెళ్లండి. Settings> Chats> Chat Backup> Backup to Make a backup ఆప్షన్లను ఎంచుకోండి. లేదంటే.. టాప్ రైట్ కార్నర్ స్ర్కీన్ లో మూడు డాట్స్ కనిపిస్తాయి. దానిపై క్లిక్ చేయగానే మీకు More ఆప్షన్ కనిపిస్తుంది. More> Export Chat Now అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. మీడియా ఐటమ్స్ (ఆడియో, వీడియో, ఫొటోలు) లేకుండా చాట్ ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు.
WhatsApp Chats Leak : వాట్సాప్‌ చాట్ ఎన్‌క్రిప్టెడ్.. సెలబ్రిటీల చాట్స్ ప్రతిసారీ ఎందుకిలా లీక్ అవుతున్నాయంటే?