Chewing Food : ఆహారాన్ని బాగా నమిలి ఎందుకు తినాలంటే!

బాగా నమలడం వల్ల ఆహారం మెత్తగా మారి లోపలికి వెళుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు పని తక్కువగా ఉంటుంది. పైగా త్వరగా జీర్ణమవుతుంది. నములుతున్నప్పుడు నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. శరీరంలో మేలు చేసి హార్మోన్ల విడుదలకు తోడ్పడుతుంది.

Chewing Food : ఆహారాన్ని బాగా నమిలి ఎందుకు తినాలంటే!

Chewing Food : జీవనశైలి మారిపోయింది. చాలామందికి కనీసం తినడానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితి. ఉరుకులపరుగుల జీవితంలో కంగారులో ఏదో నాలుగు ముద్దలు నోట్లో మింగటం తప్పించి దంతాలతో ఆహారాన్ని నములుతూ మెత్తగా చేసుకుని తినే పరిస్ధితి లేకుండా పోయింది. ఇలా చేయకపోవటం వల్లే చాలా మందిలో జీర్ణపరమైన సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే ఆహారాన్ని ప్రశాంతంగా నమిలి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

బాగా నమలడం వల్ల ఆహారం మెత్తగా మారి లోపలికి వెళుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థకు పని తక్కువగా ఉంటుంది. పైగా త్వరగా జీర్ణమవుతుంది. నములుతున్నప్పుడు నాలుకకి రుచి తెలుస్తుంది. ఆ ప్రభావం మెదడు మీద పడుతుంది. శరీరంలో మేలు చేసి హార్మోన్ల విడుదలకు తోడ్పడుతుంది. హడావుడిగా తినడం వల్ల ఎంత తింటున్నామో తెలియదు. మరో వైపు గాలి కూడా లోపలికి వెళ్లిపోతుంది. కొద్ది సేపటికే ఆకలి వేస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే బాగా నమిలి తినడం మంచిది. ఇలా చేయటం వల్ల ఎప్పుడు ఎంత తినాలో అంతే తినటం అలవాటుగా మారుతుంది. ఆకలి కూడా త్వరగా వేయదు. ఇలా చేయటం వల్ల లాలాజల గ్రంథులు పనితీరు బాగుంటుంది.

నమలడం వల్ల దంతాల మధ్యలో ఆహార పదార్థాలకు సంబంధించినవి ఇరుక్కోకుండా ఉంటాయి. అంతేకాకుండా దంతాలు కూడా గట్టి పడతాయి. ముఖ కండరాల దగ్గర కొవ్వు కూడా చేరుకోకుండా ఉంటుంది. నమిలి తినడం వల్ల ఆహారంలో ఉండే పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి. తక్కువ ఆహారమైనా సరే నమిలి తింటే ఎక్కవ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. పదేపదే తినాలన్న కోరిక ఉండదు. ఆహారంలో ఉండే బ్యాక్టీరియా వల్ల కడుపులో గ్యాస్‌, ఇన్‌ఫెక్షన్లు బాధిస్తుంటాయి. ఆ బ్యాక్టీరియాను నాశనం చేయాలంటే బాగా నమలాలి. నములుతున్నప్పుడు నోట్లో లాలాజలం స్రవిస్తుంది. ఇందులో మేలు చేసే బ్యాక్టీరియాలు అధికంగా ఉంటాయి. ఆహారంలో ఉండే బ్యాక్టీరియాతో పోరాడతాయి.