Madhya Pradesh : వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలి..లేకపోతే..ఉరి తీస్తా

టీకా తీసుకొనేందుకు వారిని ప్రోత్సాహించాలన్నారు. ఏమైనా చేయ్యండి..మొత్తానికి వ్యాక్సినేషన్ లక్ష్యాలను మాత్రం చేరుకోవాలని ఆయన వెల్లడించారు.

Madhya Pradesh : వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోవాలి..లేకపోతే..ఉరి తీస్తా

Collector

Gwalior collector : విధులు సరిగ్గా నిర్వహించాలి…కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకూడదు…లేనిపక్షంలో మిమ్మల్ని ఉరితీస్తానంటూ..ఓ కలెక్టర్.. ఉద్యోగులను హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీకాలు తీసుకోకుండా ఎవరూ ఉండకూడదు..ప్రజల వద్దకు వెళ్లండి..వారికి నచ్చచెప్పండి…ఎలాగైనా వారికి వ్యాక్సినేషన్ వేసే బాధ్యత అధికారులదేనంటూ..ఖరాఖండిగా చెప్పారు. వ్యాక్సినేషన్ లక్ష్యాలను అందుకోకపోవడంతో కలెక్టర్ ఒకింత ఆగ్రహానికి గురై…ఆవేశంగా మాట్లాడారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Prakasam : ఏపీలో మరో బస్సు ప్రమాదం…

గ్వాలియర్ జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ సంబంధించిన దానిపై ఓ సమావేశం జరిగింది. భితర్వార్ రెవెన్యూ కార్యాలయంలో ఈ మీటింగ్ జరిగింది. జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ సమావేశానికి హాజరయ్యారు. వ్యాక్సినేషన్ లక్ష్యాలను ఎందుకు చేరుకోవడం లేదని అధికారులపై మండిపడ్డారు. ఒక్కరోజు కూడా ఆలస్యం కావద్దు..అలా చేస్తే మిమ్మల్ని ఉరితీస్తానంటూ..ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట పొలాల వద్దకు వెళ్లండి..వారు వ్యాక్సినేషన్ వేసుకోవడానికి ఇష్టం లేకపోతే..వారి ముందట దండం పెట్టండి…ఇళ్ల ముందు వెయిట్ చేయండి అంటూ సూచించారు.

Read More : ఒమిక్రాన్ కొత్త లక్షణాలు

టీకా తీసుకొనేందుకు వారిని ప్రోత్సాహించాలన్నారు. ఏమైనా చేయ్యండి..మొత్తానికి వ్యాక్సినేషన్ లక్ష్యాలను మాత్రం చేరుకోవాలని ఆయన వెల్లడించారు. కలెక్టర్ కు సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఉరి తీస్తానంటూ..వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ లక్ష్యాలను చేరుకోకపోతే..సస్పెండ్ చేస్తానని మాత్రమే హెచ్చరించడం జరిగిందని వివరణ ఇచ్చారు.