Jio 4G Prepaid Plans : రిలయన్స్ జియో కొత్త 4G ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. ఏ ప్లాన్ ధర ఎంత? వ్యాలిడిటీ పూర్తి వివరాలు మీకోసం..!
Jio 4G Prepaid Plans : రిలయన్స్ జియో ఇటీవల భారత మార్కెట్లో రెండు (Jio Bharat 4G) ఫోన్లను కేవలం రూ. 999కి లాంచ్ చేసింది. కంపెనీ 4G సర్వీసులతో భారత్‌లో 2G (2G-Mukt) లేకుండా చేసేందుకు రూపొందించింది.

With Jio Bharat phones Jio announces new 4G prepaid plans
Jio 4G Prepaid Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ఎంట్రీ-లెవల్ 4G ఇంటర్నెట్-ఎనేబుల్ జియో భారత్ ఫోన్లను ఆవిష్కరించింది. కేవలం రూ. 999 ధరతో ఈ కొత్త మొబైల్ ఫోన్లు 4G సర్వీసులతో లాంచ్ అయ్యాయి. భారత్‌ను 2G (2G-ముక్త్) లేకుండా లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఫోన్లలో కెమెరాలతో పాటు JioPayతో UPI, Jio Saavn, JioCinema వంటి మరిన్ని ఫీచర్లను అందిస్తోంది. అయితే, కొత్త 4G మొబైల్ ఫోన్ లాంచ్‌తో పాటు, జియో భారత్ ఫోన్ యూజర్ల కోసం ప్రాథమిక రీఛార్జ్ ప్లాన్లను కూడా ప్రకటించింది. జియో భారత్ వినియోగదారుల కోసం రూ. 123, రూ. 1,234 ధరలతో 2 కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది.
ఈ కొత్త ప్లాన్లు అన్లిమిటెడ్ వాయిస్ కాల్లు ఇంటర్నెట్ డేటా బెనిఫిట్స్ అందిస్తాయి. కొత్త 4G ఫోన్ల అమ్మకాలను పెంచడానికి భారత్‌లో 250 మిలియన్లకుపైగా ఫీచర్ ఫోన్ యూజర్లకు ‘డిజిటల్ స్వేచ్ఛ’ అందించేలా రూపొందించాయి. ఇంకా 2G యుగంలో భారత్‌లో 250 మిలియన్ల మొబైల్ ఫోన్ యూజర్లు ఇంటర్నెట్లోని ప్రాథమిక ఫీచర్లను ట్యాప్ చేయలేకపోతున్నారు.
6 ఏళ్ల క్రితం జియో ప్రారంభంలో ఇంటర్నెట్ను ప్రతి భారతీయుడికి అందించడానికి అత్యంత చౌకైన ధరకే డేటాను అందించింది. కొత్త జియో భారత్ ఫోన్ ద్వారా వినియోగదారులకు 4G ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. జియో భారత్ మొబైల్ ఫోన్ వినియోగదారులకు కొత్త జియో ప్లాన్లను వివరంగా పరిశీలిద్దాం.

With Jio Bharat phones Jio announces new 4G prepaid plans
జియో భారత్ రూ.123 రీఛార్జ్ ప్లాన్ :
జియో భారత్ ప్లాన్ రూ. 123 ధరతో యూజర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మొత్తం 14 GB డేటాను అందిస్తుంది. వినియోగదారులు రీఛార్జ్ తేదీ నుంచి 28 రోజుల పాటు రోజుకు 0.5GB డేటాను పొందవచ్చు. ఇతర ఆపరేటర్లతో పోలిస్తే.. ఈ ప్లాన్ యూజర్లకు 30 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని జియో పేర్కొంది. ఇతర ఆపరేటర్లు కేవలం 2GB డేటాతో వాయిస్ కాల్లపై రూ.179 ప్లాన్‌ను అందిస్తున్నాయి.
జియో భారత్ రూ. 1234 రీఛార్జ్ ప్లాన్ :
రెండో జియో భారత్ ప్లాన్.. ఇది వార్షిక ప్లాన్, దీని ధర రూ. 1234. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మొత్తం 168GB డేటా (రోజుకు 0.5GB)తో పాటు మొత్తం ఏడాదికి అన్ లిమిటెడ్కాలింగ్ను పొందవచ్చు. జియో ప్లాన్ పోటీదారుల కన్నా 7 రెట్లు ఎక్కువ డేటాను అందిస్తుందని, ఫలితంగా రోజుకు డేటాపై 25 శాతం ఆదా అవుతుందని పేర్కొంది.