Covid-19 Positivity Rate : 15శాతం పాజిటివిటీ రేటు ఉన్న ఆ 150 జిల్లాల్లో లాక్‌డౌన్…

భారతదేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.

Covid-19 Positivity Rate : 15శాతం పాజిటివిటీ రేటు ఉన్న ఆ 150 జిల్లాల్లో లాక్‌డౌన్…

Covid 19 Positivity Rate

Covid-19 Positivity Rate in India : భారతదేశంలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో 15శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో లాక్ డౌన్ విధించే దిశగా ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకూ 150 జిల్లాలో పాజిటివిటీ రేటు ఆధారంగా లాక్ డౌన్ విధించే అవకాశం కనిపిస్తోంది. ఇందులో అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్నీ సర్వీసులు నిలిచిపోనున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. దేశంలో పలు జిల్లాలో అత్యధిక స్థాయిలో పెరిగిపోతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అత్యవసర చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వచ్చే కొన్ని వారాల్లో కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పలు జిల్లాల్లో లాక్ డౌన్ వంటి కఠినమైన చర్యలు చేపట్టాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. దాదాపు వారంలో భారత్ రోజువారీ కరోనా కేసుల సంఖ్య 3లక్షలకు చేరింది. సోమవారం దేశవ్యాప్తంగా ఒకరోజే 3.23 లక్షల కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

మహారాష్ట్రలో అత్యధిక స్థాయిలో కొత్త కేసులు 48,700 నమోదు కాగా.. ఉత్తరప్రదేశ్ లో 33,551, కర్ణాటకలో 29,744 కొత్త కేసులు నమోదయ్యాయి. తక్కువ జనాభా కలిగిన కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. భారత్ రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 20శాతంగా నమోదైంది. మార్చి మధ్య నుంచి యాక్టివ్ కేస్ లోడ్ స్థిరంగా కొనసాగుతోంది. సోమవారం నాటికి 28.8 లక్షల కేసులకు చేరింది.

ఎనిమిది రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక, కేరళ, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్ గడ్, తమిళనాడులో యాక్టివ్ కేసులు లక్షకు పైగా నమోదయ్యాయి. మొత్తంగా కరోనా కేసులు 69శాతం మేర పెరిగాయి. దేశవ్యాప్తంగా సోమవారం నాటికి 2,771 మరణాలు నమోదు కాగా.. 10 రాష్ట్రాల్లో కలిపి 77.3శాతం మరణాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోనే గరిష్టంగా 524 మంది మరణించగా.. ఢిల్లీ రోజువారీ కరోనా మరణాలు 380కు చేరింది.