Garlic Tea : చలికాలంలో రోజుకు ఒక కప్పు వెల్లుల్లి టీ తీసుకుంటే అనేక ప్రయోజనాలు!

రక్తహీనతతో బాధపడేవారికి సమస్యను అధిగమించేందుకు సరైన ఔషధం వెల్లుల్లిని చెప్పవచ్చు. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తహీనత నుంచి త్వరగా బయటపడచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Garlic Tea : చలికాలంలో రోజుకు ఒక కప్పు వెల్లుల్లి టీ తీసుకుంటే అనేక ప్రయోజనాలు!

A cup of garlic tea a day during winters has many benefits!

Garlic Tea : ఉల్లిలాగే వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో అనేక ఔషదగుణాలు ఉన్నాయి. బరువు తగ్గించడం దగ్గర్నుంచి, రక్తహీనతను దూరం చేయడం వరకు వెల్లుల్లి మనకు అన్ని విధాలుగా సహాయకారిగా పనిచేస్తుంది. రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చు. వెల్లుల్లిలో అల్లిసిన్, డయల్ డైసల్ఫైడ్ మరియు డయల్ ట్రైసల్ఫైడ్ వంటి సల్ఫర్-కలిగిన సమ్మేళనాలు ఉన్నాయి. రక్తపోటును నియంత్రించడంలో కూడా మీకు సహాయపడుతుంది.

గుండె జబ్బుతో బాధపడే వారు వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ మెరుగుపడి.. గుండెపోటు రాకుండా జాగ్రత్తపడచ్చు. శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ క్లాటింగ్ గుణాలే దీనికి కారణం. వెల్లుల్లిలోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల కారణంగా చలికాలంలో వచ్చే గొంతు సంబంధిత సమస్యలు మనల్ని బాధించవు. అందుకే గొంతు నొప్పితో బాధపడేవారు వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

రక్తహీనతతో బాధపడేవారికి సమస్యను అధిగమించేందుకు సరైన ఔషధం వెల్లుల్లిని చెప్పవచ్చు. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే రక్తహీనత నుంచి త్వరగా బయటపడచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వెల్లుల్లిలోని రసాయనాలు ఐరన్ విడుదలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. దీంతో అనీమియా సమస్యకు చెక్ చెప్పవచ్చు. వెల్లుల్లితో ప్రతిరోజు టీ గా తయారు చేసుకుని తీసుకుంటే ఆరోగ్యానికి అన్ని విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి.

వెల్లులి టీ తయారీ ;

ముందుగా 3 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి. వాటిని సన్నని ముక్కలుగా తరగాలి. స్టవ్ పై నీటిని ఉంచి బాగా మరిగించాలి. ఆనీటిలో తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకుని బాగా మరిగించాలి. ఐదు నిమిషాల ఉంచి తరువాత స్టవ్ అపేయాలి. అనంతరం వడకట్టుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి టీని తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల అనేక ఆనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యాన్నికాపాడుకోవచ్చు.