Cardamom : నోటి ఇన్ ఫెక్షన్లతోపాటు, దుర్వాసన పోగొట్టే యాలకులు!

ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. నిద్ర బాగా పడుతుంది.

Cardamom : నోటి ఇన్ ఫెక్షన్లతోపాటు, దుర్వాసన పోగొట్టే యాలకులు!

Cardamom

Cardamom : యాలకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేదం ప్రకారం అనేక ఔషదగుణాలు యాలకుల్లో ఉన్నాయి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి యాలకులను ఏదో రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వికారం, కడుపుబ్బరం, ఆకలి మందగించటం, వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి యాలుకలు బాగా ఉపకరిస్తాయి. ఆయా సమస్యల నుండి బయటపడేలా చేస్తాయి. శరీరంలోని వ్యర్ధాలను తొలగించటంలో కూడా దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు.

జలుబు, దగ్గు వంటి సమస్యలతోపాటుగా, రక్తపోటును అదుపులో ఉంచటంలో తోడ్పడతాయి. యాలుకల్లో పీచు పదార్ధం ఉంటుంది. వీటిని నోట్లు వేసుకోవటం వల్ల నోట్లో అల్సర్లు, ఇన్ ఫెక్షన్లు వంటివి తొలగిపోతాయి. వాంతులు అయినప్పుడు అరలీటరు నీటిలో ఐదు గ్రాముల యాలకలను వేసి ఉడకబెట్టండి. బాగా కాగిన తర్వాత నీటిని సేవిస్తే వాంతులు తగ్గి, శరీరంలోని నీరసం తగ్గుతుంది. యాలుకలను రోజుకు రెండు చొప్పున తీసుకుంటే వీర్యకణాలు వృద్ధి చెందుతాయి. అంతేకాకుండా నపుంసకత్వం లాంటి లైంగిక సమస్యలు దూరమవుతాయి.

ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్ర పోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. నిద్ర బాగా పడుతుంది. దగ్గుతో ఇబ్బంది ,గొంతులో మంట, బొంగురుపోయినట్లుంటే ఉదయం లేవగానే యాలకలను నమిలి తినాలి. అనంతరం గోరువెచ్చని నీటిని త్రాగితే ఉపశమనం కలుగుతుంది. నోట్లో పొక్కులుంటే యాలకలతోపాటు కలకండను కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ మిశ్రమాన్ని నాలుకపై ఉంచుకోండి. దీంతో వెంటనే ఉపశమనం కలుగుతుంది.

యాలకుల్లో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ప్రీరాడికల్స్‌ని నాశనం చేస్తాయి. యాలకుల్లో విటమిన్ ఎ, బి, సి, రైబో ఫ్లేవిన్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను తొలగించడంతో పాటు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడతాయి.