Osteoporosis : వయస్సు పెరుగుతున్న వారిలో బోలు ఎముకల సమస్య ఎందుకంటే?

తక్కువ కాల్షియం ఆహారం, తక్కువ శరీర బరువు, జీవనశైలి లోపాలు, పోషకాహారలోపం, ధూమపానం, అధిక మద్యపానం వంటి బోలు ఎముకల వ్యాధికి కారణమౌతాయి. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వివిధ రకాల వ్యాధులకు మందులు ఎక్కువగా వాడేవారిలో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది.

Osteoporosis : వయస్సు పెరుగుతున్న వారిలో బోలు ఎముకల సమస్య ఎందుకంటే?

osteoporosis in the aging population

Osteoporosis : వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలాన్ని కోల్పోతాయి. ఎముక క్షీణత, ఎముక పెరుగుదల అనేది సర్వసాధారణం. అయితే ఎముక పెరుగుదల రేటు కంటే ఎముక క్షీణత రేటు వేగంగా ఉంటే అది బోలు ఎముకల వ్యాధికి దారితీసే ప్రమాదం ఉంటుంది. ఈ రకమైన బోలు ఎముకల వ్యాధికి అనేక అంశాలు కారణమౌతాయి. దీని వల్ల ఎముకలు తరచుగా విరగుతాయి. ఆస్టియోపోరోసిస్ అనేది ఎముక పగుళ్ల వ్యాధి. ఇది అకస్మాత్తుగా వచ్చే సమస్య కాదు. దీర్ఘకాలిక ఆర్థరైటిస్ సమస్య కారణంగా ఈ ఆస్టియోపోరోసిస్ వస్తుంది.

దీని వల్ల ఎముక పగుళ్లు, నొప్పి,వైకల్యం వంటివి కలుగుతాయి. ఇది శరీరంలోని ఏ ప్రాంతంలోని ఎముకపైనైనా ప్రభావం చూపవచ్చు. ముఖ్యంగా దీని ప్రభావం వెన్నెముక ఎముకలపై ఉంటే వెన్ను వంగడం, కాళ్లు వంకర్లు తిరగటం వంటివి చోటు చేసుకుంటాయి. చాలా మందిలో వయసు పెరిగే కొద్దీ ఎముకలు బలాన్ని కోల్పోతాయి. 35 సంవత్సరాల తర్వాత, పాత ఎముక కోల్పోకుండా నిరోధించడానికి శరీరం కొత్త ఎముకను రూపకల్పన చేస్తుంది. ఇది కొంతమందిలో బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. వంశపారంపర్యం వల్ల కొందరిలో ఆస్టియోపోరోసిస్ రావచ్చు. రుతువిరతి తర్వాత మహిళల్లో బోలు ఎముకల వ్యాధి సర్వసాధారణంగా వస్తుంది.

తక్కువ కాల్షియం ఆహారం, తక్కువ శరీర బరువు, జీవనశైలి లోపాలు, పోషకాహారలోపం, ధూమపానం, అధిక మద్యపానం వంటి బోలు ఎముకల వ్యాధికి కారణమౌతాయి. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వివిధ రకాల వ్యాధులకు మందులు ఎక్కువగా వాడేవారిలో బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది. కొన్ని థైరాయిడ్ సమస్యలతో సహా స్టెరాయిడ్స్, ఇతర వ్యాధులతో సహా కొన్ని మందులు వాడటం వల్ల ఆస్టియోపోరోసిస్ ముప్పు పెరుగుతుందని వైద్యులు అంటున్నారు.

ఎముకలు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవాలి. కాల్షియం, విటమిన్ డి, కాల్షియం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ద్వారా ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అవసరమైతే వైద్యుల సలహాలు, సూచనలు పాటించటం ద్వారా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.