Breast Cancer : మహిళలను బాధిస్తున్న రొమ్ము క్యాన్సర్ ! అవగాహన అవసరమే…

కుటుంబ చరిత్ర, ముఖ్యంగా దగ్గరి బందువులలో ఈ వ్యాధి వుంటే స్త్రీల వయసు పెరిగే కొద్దీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతూ పోతుంది. ముందుగా గర్భాశయం క్యాన్సరు వచ్చిఉంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.

Breast Cancer : మహిళలను బాధిస్తున్న రొమ్ము క్యాన్సర్ ! అవగాహన అవసరమే…

Breast cancer affecting women! Understanding is necessary...

Updated On : February 26, 2023 / 11:16 AM IST

Breast Cancer : స్త్రీలలో వచ్చే క్యాన్సరులలో అతి సాధారణమైనది రొమ్ము క్యాన్సరు. రొమ్ము క్యాన్సర్ అనేది 15 నుండి 39 సంవత్సరాల వయస్సు గల మహిళల్లో సంభవిస్తుంది. రొమ్ము క్యాన్సర్‌ను నివారించలేకపోయిన క్యాన్సర్‌ వల్ల కలిగే మరణాలను తగ్గించవచ్చు. క్యాన్సరు వల్ల స్త్రీలలో కలిగే మరణాలలో రొమ్ము క్యాన్సర్ అనేది రెండవ స్థానంలో వున్నది. స్త్రీ జీవిత కాలంలో ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఉంటాయి. రొమ్ము క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడానికి సులభమైన మార్గం స్వీయ-పరీక్ష అని చెప్పవచ్చు.

రొమ్ము క్యాన్సర్ కనిపించే లక్షణాలు ;

రొమ్ములో గడ్డ లు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో చనుమొనల నుంచి ద్రవాలు స్రవించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెనుదిరిగిన చనుమొనలు, చనుమొనలు ఎఱ్ఱగా, కందినట్టుగా కనిపించటం, రొమ్ములు పెద్దవిగా మారటం, రొమ్ములు కుంచించుకు పోయినట్టు వుండడం, రొమ్ములు గట్టిపడడం, ఎముకలలో నొప్పి, నడుము నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

READ ALSO : మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తీసుకుంటే మేలు!

క్యాన్సర్ రావటానికి గల కారణాలు ;

కుటుంబ చరిత్ర, ముఖ్యంగా దగ్గరి బందువులలో ఈ వ్యాధి వుంటే స్త్రీల వయసు పెరిగే కొద్దీ వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతూ పోతుంది. ముందుగా గర్భాశయం క్యాన్సరు వచ్చిఉంటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రొమ్ములకు సంబంధించిన జబ్బులు వచ్చి ఉండడం, రొమ్ములలో అసాధారణ మార్పులు వచ్చి వుండడం, జన్యు పరమైన లోపాలు, 50సంవత్సరాలు దాటిన తరువాత బహిష్టులు ఆగిపోవడం, పిల్లలు పుట్టకపోవటం, మధుపానం, ఆహారంలో ఎక్కువ క్రొవ్వు పదార్థాలు తీసుకోవడం, పీచు పదార్థాలు తక్కువగా వున్న ఆహారం తీసుకోవడం, అధిక బరువు, అండాశయ క్యాన్సరు, పెద్ద పేగుల క్యాన్సరు ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదానికి దారితీస్తాయి.

READ ALSO : Chillies : రోగనిరోధక శక్తిని పెంచటంతో పాటుగా, జీవక్రియకు సహాయపడే మిరపకాయలు!

నివారించాలంటే ముందస్తుగానే ;

ప్రతినెలా రొమ్ములను స్వయంగా పరీక్షించుకోవాలి. సంవత్సరానికి ఒకసారి వైద్యనిపుణులతో రొమ్ముల పరీక్ష చేయించుకోవటం మంచిది. రోజువారిగా పౌష్ఠికాహాకారాన్ని తీసుకోవాలి. రొమ్ములో గడ్డలు చిన్నవికానీ, పెద్దవికానీ వున్నట్టు ఎంత మాత్రం అనుమానం కలిగినా వెంటనే వైద్యులను సంప్రదించాలి. రొమ్ము క్యాన్సరు త్వరగా గుర్తించి చికిత్స తీసుకుంటే నయం చేసుకొవచ్చు, ఆలస్యం చేస్తే ప్రాణాంతకం మారే పరిస్ధితి ఉంటుంది.