Caffeine : టీ,కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల ఆరోగ్యానికి నష్టమా?..లాభమా?..

కెఫిన్ మీద అనేక విస్తృతమైన అధ్యయనాలు జరిగినప్పటికీ, నేటికి అనేక అపోహలు ఉన్నాయి. కెఫిన్ కలిగి ఉన్న కాఫీ,టీలు తాగటం వల్ల మనిషి శరీరంలో ఎలాంటి దుష్పప్రభావాలు కలుగుతాయన్న దానిపై చాలా

Caffeine : టీ,కాఫీలలో ఉండే కెఫిన్ వల్ల ఆరోగ్యానికి నష్టమా?..లాభమా?..

Cafin

Caffeine : కెఫిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల జాతుల మొక్కల ఆకులు, విత్తనాలు, పండ్లలో కనిపించే సహజ మైన పదార్ధంగా చెప్పవచ్చు. ముఖ్యంగా టీ, కాఫీ వంటి కొన్ని శీతల పానీయాలు కెఫిన్ ను కలిగి ఉంటాయన్న విషయం మనందరికి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ ఉత్పత్తులను నిత్యం తమ రోజువారీ జీవితంలో ఉపయోగిస్తుంటారు. అధిక స్థాయి కెఫిన్ ఉన్న పానీయాలు శక్తి ఎనర్జిటిక్ డ్రింక్స్ గా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కెఫిన్ అనేది తాత్కాలికంగా అలసటను పోగొట్టే ఒకరమైన ఉత్పేరకంగా పనిచేస్తుందని కొంత మంది నిపుణులు చెబుతున్నారు.

కెఫిన్ మీద అనేక విస్తృతమైన అధ్యయనాలు జరిగినప్పటికీ, నేటికి అనేక అపోహలు ఉన్నాయి. కెఫిన్ కలిగి ఉన్న కాఫీ,టీలు తాగటం వల్ల మనిషి శరీరంలో ఎలాంటి దుష్పప్రభావాలు కలుగుతాయన్న దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. అయితే వాస్తవానికి, నిపుణుల అభిప్రాయం ప్రకారం, నిత్యం కెఫిన్ వినియోగిస్తున్నవారిలో అకస్మాత్తుగా నిలిపివేస్తే కొంతమంది వ్యక్తులు తలనొప్పి, అలసట మరియు మగతకు గురైనట్లు తెలింది. ఈ లక్షణాలు గరిష్టంగా ఒక రోజు పాటు ఉంటాయి. క్రమంగా కెఫిన్ తీసుకోవడం తగ్గించుకోవటం ద్వారా వీటి నుండి బయటపడవచ్చు.

చాలా మందిలో కెఫిన్ వాడకం వల్ల గుండె జబ్బులు వస్తాయన్న అపోహతో ఉంటారు. కెఫిన్ వినియోగం గుండె జబ్బు ప్రమాదాన్ని పెంచదని మరియు కొలెస్ట్రాల్ లేదా హృదయ స్పందన రేటుపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని అధ్యయనంలో తేలింది. హైపర్సెన్సిటివిటీ ఉన్న వ్యక్తులలో రక్తపోటులో స్వల్ప పెరుగుదల కెఫిన్ వినియోగంతో ముడిపడి ఉంటుంది. అధిక రక్తపోటు ఉన్నవారు కెఫిన్ తీసుకోవడం తగ్గించటమే మంచిది.

కెఫిన్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచదని నిరూపించడానికి తగినంత శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. నార్వే మరియు హవాయిలో రెండు అధ్యయనాల్లో రెగ్యులర్ కాఫీ , టీ వినియోగం వల్ల క్యాన్సర్ ప్రమాదం వచ్చే అవకాశంలేదని తేలింది. 20,000 మందికి పైగా వ్యక్తుల డేటాను సేకరించగా ఈ విషయం వెల్లడైంది. మితమైన కెఫిన్ వినియోగం గర్భిణీ స్త్రీలకు మరియు పుట్టబోయే శిశువులకు సురక్షితం అని అధ్యయనాలు చెబుతున్నాయి. పునరుత్పత్తి పనితీరుపై కెఫిన్ కలిగిన పానీయాల ప్రభావాన్ని పరిశీలించగా కెఫిన్ తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి పై ప్రభావం ఉన్నట్లు ఎలాంటి అధారాలు కనుగొనలేకపోయారు.

కెఫిన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు మితంగా తీసుకోవడం వల్ల పిల్లలపై చెడు ప్రభావం ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి. కెఫిన్ అధిక మోతాదులో తీసుకోవటం వల్ల పిల్లలలో చిరాకు, ఉత్సాహం, ఆందోళన వంటి తాత్కాలిక దుష్ప్రభావాలకు కారణమవుతున్నట్లు అధ్యయనంలో తేలింది. పెద్దల మాదిరిగానే కెఫిన్‌ను ప్రాసెస్ చేసే సామర్థ్యం పిల్లల శరీరాలకు ఉంటుంది. బోలు ఎముకల వ్యాధికి కెఫిన్ తీసుకోవడం ప్రమాదకరం ఏమాత్రం కాదట.